ఇంతులెల్లా విని యింక నేమందురు
(॥పల్లవి॥)
ఇంతులెల్లా విని యింక నేమందురు
కాంతుఁడవు ఇటువంటి కాకు గలదా
(॥ఇంతు॥)
అగ్గమై నీవు నా వొద్ద నాపెచన్నులంటఁగాను
సిగ్గువడి వున్నదాన చెక్కుచేతితో
యెగ్గెరఁగకొక్కపారే యిద్దరిఁ గూడవచ్చేవు
కగ్గుదేర నిటువంటి కాకుగలదా
(॥ఇంతు॥)
పొరి నేఁ జూడఁగా నాపె పోఁకముడి జారించఁగా
శిరసు వంచుకుందాన చెక్కుచేతితో
సరుస సిబ్బితి లేక జంట రతి సేసేవు
గరిమెల నిటువంటి కాకు గలదా
(॥ఇంతు॥)
వుమ్మడి నాకె నీవు నావొద్దనే కూడఁగాను
చిమ్మిరేఁగి వున్నదాన చెక్కుచేతితో
యెమ్మెతో శ్రీవేంకటేశ యిట్టే నన్నుఁ గూడితివి
కమ్మరఁ గమ్మర నింత కాకు గలదా
(||pallavi||)
iṁtulĕllā vini yiṁka nemaṁduru
kāṁtum̐ḍavu iḍuvaṁṭi kāgu galadā
(||iṁtu||)
aggamai nīvu nā vŏdda nābĕsannulaṁṭam̐gānu
sigguvaḍi vunnadāna sĕkkusedido
yĕggĕram̐gagŏkkabāre yiddarim̐ gūḍavachchevu
kaggudera niḍuvaṁṭi kāgugaladā
(||iṁtu||)
pŏri nem̐ jūḍam̐gā nābĕ pom̐kamuḍi jāriṁcham̐gā
śhirasu vaṁchuguṁdāna sĕkkusedido
sarusa sibbidi lega jaṁṭa radi sesevu
garimĕla niḍuvaṁṭi kāgu galadā
(||iṁtu||)
vummaḍi nāgĕ nīvu nāvŏddane kūḍam̐gānu
simmirem̐gi vunnadāna sĕkkusedido
yĕmmĕdo śhrīveṁkaḍeśha yiṭṭe nannum̐ gūḍidivi
kammaram̐ gammara niṁta kāgu galadā