ఇంతులచేఁ జెప్పి పంపె యిదివో యాతఁడు దానె
(॥పల్లవి॥)
ఇంతులచేఁ జెప్పి పంపె యిదివో యాతఁడు దానె
సంతసపు మేలుసుద్ది చాటరే యిందరికి
(॥ఇంతులచే॥)
అంగనవద్దికి నేఁడు అతఁడే విచ్చేసీ నట
సింగారింతము రారే చెలులాల
ముంగిల ముగ్గులు వెట్టి ముత్తేల పందిలికింద
బంగారుపీఁట వెట్టి పరవు వరచరే
(॥ఇంతులచే॥)
యిందుముఖి మన్నించ నిప్పుడిది వేళ యట
విం దాయిత్తము సేయరే వెలఁదులాల
గందముఁ గస్తూరియును కప్పురవిడెములును
అందుకఁ బన్నీటఁ బాదా లదె కడుగరే
(॥ఇంతులచే॥)
వాయిదాలు వాయించేరు వాకిటికి రాఁ బోలు
యీయింతిఁ జేపట్టినాఁ డింతలో నట
యీ యెడ శ్రీవెంకటేశుఁ డీమగువతోఁ గూడె
చే యెత్తే మొక్కరే మీరు సేసినట్టి మేలుకు
(||pallavi||)
iṁtulasem̐ jĕppi paṁpĕ yidivo yādam̐ḍu dānĕ
saṁtasabu melusuddi sāḍare yiṁdarigi
(||iṁtulase||)
aṁganavaddigi nem̐ḍu adam̐ḍe vichchesī naḍa
siṁgāriṁtamu rāre sĕlulāla
muṁgila muggulu vĕṭṭi muttela paṁdiligiṁda
baṁgārubīm̐ṭa vĕṭṭi paravu varasare
(||iṁtulase||)
yiṁdumukhi manniṁcha nippuḍidi veḽa yaḍa
viṁ dāyittamu seyare vĕlam̐dulāla
gaṁdamum̐ gastūriyunu kappuraviḍĕmulunu
aṁdugam̐ bannīḍam̐ bādā ladĕ kaḍugare
(||iṁtulase||)
vāyidālu vāyiṁcheru vāgiḍigi rām̐ bolu
yīyiṁtim̐ jebaṭṭinām̐ ḍiṁtalo naḍa
yī yĕḍa śhrīvĕṁkaḍeśhum̐ ḍīmaguvadom̐ gūḍĕ
se yĕtte mŏkkare mīru sesinaṭṭi melugu