ఇంతులము నేనూ మి మ్మిద్దరి గూరుచఁ బూఁట
(॥పల్లవి॥)
ఇంతులము నేనూ మి మ్మిద్దరి గూరుచఁ బూఁట
వంతుకెక్కినట్టి విూ విూ వయసులే పూఁట
(॥ఇంతు॥)
పాయరాని మోహముల బలువై నిలుపుటకు
సోయగపు మీలోని చూపులే పూఁట
కాయముఁ గాయము సోఁకి కరఁచేయందుకు నెల్లా
ఆయములై లంకెలైన ఆధరములే పూఁట
(॥ఇంతు॥)
గచ్చులై యెదలోఁ దమకములు రేఁచుటకు
మచ్చికె మీలోని యెడమాటలే పూఁట
యెచ్చిన యెదిటి సిగ్గు యించుకంతాఁ బోవుటకు
ముచ్చటలాడేటి మీముదములే పూఁట
(॥ఇంతు॥)
ప్రియముతో రతి మిమ్ముఁ బెనఁగఁజేయుటకు
నయగారితనముల నవ్వులే పూఁట
నియతి శ్రీవేంకటేశ నెలఁత నీ కూటమికి
భయములేని సరసభావములే పూఁట
(||pallavi||)
iṁtulamu nenū mi mmiddari gūrusam̐ būm̐ṭa
vaṁtugĕkkinaṭṭi viూ viూ vayasule pūm̐ṭa
(||iṁtu||)
pāyarāni mohamula baluvai nilubuḍagu
soyagabu mīloni sūbule pūm̐ṭa
kāyamum̐ gāyamu som̐ki karam̐seyaṁdugu nĕllā
āyamulai laṁkĕlaina ādharamule pūm̐ṭa
(||iṁtu||)
gachchulai yĕdalom̐ damagamulu rem̐suḍagu
machchigĕ mīloni yĕḍamāḍale pūm̐ṭa
yĕchchina yĕdiḍi siggu yiṁchugaṁtām̐ bovuḍagu
muchchaḍalāḍeḍi mīmudamule pūm̐ṭa
(||iṁtu||)
priyamudo radi mimmum̐ bĕnam̐gam̐jeyuḍagu
nayagāridanamula navvule pūm̐ṭa
niyadi śhrīveṁkaḍeśha nĕlam̐ta nī kūḍamigi
bhayamuleni sarasabhāvamule pūm̐ṭa