ఇంతులఁ గంటేఁ జాలు నెవ్వరున్నా నెఱఁగవు
(॥పల్లవి॥)
ఇంతులఁ గంటేఁ జాలు నెవ్వరున్నా నెఱఁగవు
ఇంత కాతరించిపడే వింటికి రారాదా
(॥ఇంతు॥)
మానరాదా ఇటువంటిమాటలు దొరలనోట
నానితేరు విన్నవారు నవ్వరా నిన్ను
కానితిట్లు దిట్టేవు కఁడు బెద్దరికాలకు
మానవుగా ఇటువంటిమాతోడచలము
(॥ఇంతు॥)
పట్టరాదా పాయ మింత పచ్చిచేతఁరాజవు నీ-
యట్టివానందుఁ గలితే నాడరా నిన్ను
ముట్టి గొరఁ జెనకేవు మోఁచి యారజముగాను
దిట్టవౌత గంటి నాకె తేరిచూడనేఁటికి
(॥ఇంతు॥)
వుండరాదా కొంతవడి వూరటగా జాణఁడవు
మెండుగాఁ దమకించితే మెత్తురా నిన్ను
కొండల శ్రీవేంకటేశ కూడితిని నన్ను నిట్టె
బండుబూతు లిఁక నేల పంతమెక్కె నిపుడు
(||pallavi||)
iṁtulam̐ gaṁṭem̐ jālu nĕvvarunnā nĕṟam̐gavu
iṁta kādariṁchibaḍe viṁṭigi rārādā
(||iṁtu||)
mānarādā iḍuvaṁṭimāḍalu dŏralanoḍa
nānideru vinnavāru navvarā ninnu
kānidiṭlu diṭṭevu kam̐ḍu bĕddarigālagu
mānavugā iḍuvaṁṭimādoḍasalamu
(||iṁtu||)
paṭṭarādā pāya miṁta pachchisedam̐rājavu nī-
yaṭṭivānaṁdum̐ galide nāḍarā ninnu
muṭṭi gŏram̐ jĕnagevu mom̐si yārajamugānu
diṭṭavauda gaṁṭi nāgĕ terisūḍanem̐ṭigi
(||iṁtu||)
vuṁḍarādā kŏṁtavaḍi vūraḍagā jāṇam̐ḍavu
mĕṁḍugām̐ damagiṁchide mĕtturā ninnu
kŏṁḍala śhrīveṁkaḍeśha kūḍidini nannu niṭṭĕ
baṁḍubūdu lim̐ka nela paṁtamĕkkĕ nibuḍu