Imtulagum badulagu nikkuva live

ఇంతులకుఁ బతులకు నిక్కువ లివె
Language

(॥పల్లవి॥)
ఇంతులకుఁ బతులకు నిక్కువ లివె
చెంతనున్న యీతనికి సేవ లిట్టె సేయవే

(॥ఇంతు॥)
కనుచూపులలో నుండు కందువైన సన్నలు
పెనగులాటల నుండు ప్రియములెల్మా
వినయములందు నుండు వేడుకైనమొగమోట
ననుపులయందు నుండు నవ్వుల సరసము

(॥ఇంతు॥)
కంచము పొత్తులనుండు కలయుచుట్టరికము
మంచిమాటలనె వుండు మమకారము
వంచెన మొక్కుల నుండు వాడికైన తరితీపు
నించిన నేర్పుల నుండు నెలకొన్న సిరులు

(॥ఇంతు॥)
పచ్చిచేఁతలలో నుండు భావములకరఁగులు
ఇచ్చకములో నుండు ఇంపు లమరి
అచ్చపు శ్రీవేంకటేశునలమేల్మంగవు నీవు
కొచ్చి కొచ్చి యాగతుల కూడిమాడి వుండవే

(||pallavi||)
iṁtulagum̐ badulagu nikkuva livĕ
sĕṁtanunna yīdanigi seva liṭṭĕ seyave

(||iṁtu||)
kanusūbulalo nuṁḍu kaṁduvaina sannalu
pĕnagulāḍala nuṁḍu priyamulĕlmā
vinayamulaṁdu nuṁḍu veḍugainamŏgamoḍa
nanubulayaṁdu nuṁḍu navvula sarasamu

(||iṁtu||)
kaṁchamu pŏttulanuṁḍu kalayusuṭṭarigamu
maṁchimāḍalanĕ vuṁḍu mamagāramu
vaṁchĕna mŏkkula nuṁḍu vāḍigaina taridību
niṁchina nerbula nuṁḍu nĕlagŏnna sirulu

(||iṁtu||)
pachchisem̐talalo nuṁḍu bhāvamulagaram̐gulu
ichchagamulo nuṁḍu iṁpu lamari
achchabu śhrīveṁkaḍeśhunalamelmaṁgavu nīvu
kŏchchi kŏchchi yāgadula kūḍimāḍi vuṁḍave