ఇంతులకుఁ బతులకు నెరవున్నదా
(॥పల్లవి॥)
ఇంతులకుఁ బతులకు నెరవున్నదా
సంతోసము లీడేరు సమ్మతులైతేను
(॥ఇంతు॥)
ముచ్చట లాడఁగవచ్చు మోములు చూడఁగవచ్చు
ఇచ్చకమై మనసులు యెనసితేను
పచ్చిదేర నవ్వవచ్చు పట్టి పెనఁగఁగవచ్చు
కచ్చుక చుట్టరికము గలసితేను
(॥ఇంతు॥)
సుద్దులు చెప్పఁగవచ్చు చూపుల సొలయవచ్చు
వొద్దకైన నేస్తము లొనరితేను
ముద్దులు గునియవచ్చు మొక్కులాడఁగవచ్చు
పోద్దు వొద్దు సరసాలు పొసఁగితేను
(॥ఇంతు॥)
వాడికలు చూపవచ్చు వలపులు చల్లవచ్చు
తోడఁడోడ వయసులు దొరసితేను
యీడుజోడై శ్రీవేంకటేశ యలమేల్మంగను
కూడితివి మెచ్చవచ్చు గుణా లిట్టై(ట్ట?) యితేను
(||pallavi||)
iṁtulagum̐ badulagu nĕravunnadā
saṁtosamu līḍeru sammadulaidenu
(||iṁtu||)
muchchaḍa lāḍam̐gavachchu momulu sūḍam̐gavachchu
ichchagamai manasulu yĕnasidenu
pachchidera navvavachchu paṭṭi pĕnam̐gam̐gavachchu
kachchuga suṭṭarigamu galasidenu
(||iṁtu||)
suddulu sĕppam̐gavachchu sūbula sŏlayavachchu
vŏddagaina nestamu lŏnaridenu
muddulu guniyavachchu mŏkkulāḍam̐gavachchu
poddu vŏddu sarasālu pŏsam̐gidenu
(||iṁtu||)
vāḍigalu sūbavachchu valabulu sallavachchu
toḍam̐ḍoḍa vayasulu dŏrasidenu
yīḍujoḍai śhrīveṁkaḍeśha yalamelmaṁganu
kūḍidivi mĕchchavachchu guṇā liṭṭai(ṭṭa?) yidenu