ఇంతులకుఁ బతులకే ఇరవైనది వలపు
(॥పల్లవి॥)
ఇంతులకుఁ బతులకే ఇరవైనది వలపు
సంతతపు వేడుకలఁ జవులైన వలపు
(॥ఇంతు॥)
జోకతోడ నిట్టినది చూపఁగరాదు వలపు
వాకుచ్చి చెప్పఁగరాదు వలపు
దాకొని ఇట్టిరూపని తలఁచరాదు వలపు
యేకడ నెవ్వరికిని యెంచరాదు వలపు
(॥ఇంతు॥)
యెదుట నున్నట్టె వుండు యెఱఁగరాదు వలపు
వదలించి తియ్యరాదు వలపు
గుదిగొని మదిలోన కుచ్చుకవుండు వలపు
సదరాన నేరుపరచఁగరాదు వలపు
(॥ఇంతు॥)
పెంచఁబెంచ నెంతైనాఁ బెరుగుచుండు వలపు
వంచించి పొలుగనీఁదు వలపు
అంచెల శ్రీవేంకటేశుఁ డలమేలుమంగఁగూడె
పంచసాయకుని రాజ్యపదవి యీవలపు
(||pallavi||)
iṁtulagum̐ badulage iravainadi valabu
saṁtadabu veḍugalam̐ javulaina valabu
(||iṁtu||)
jogadoḍa niṭṭinadi sūbam̐garādu valabu
vāguchchi sĕppam̐garādu valabu
dāgŏni iṭṭirūbani talam̐sarādu valabu
yegaḍa nĕvvarigini yĕṁcharādu valabu
(||iṁtu||)
yĕduḍa nunnaṭṭĕ vuṁḍu yĕṟam̐garādu valabu
vadaliṁchi tiyyarādu valabu
gudigŏni madilona kuchchugavuṁḍu valabu
sadarāna nerubarasam̐garādu valabu
(||iṁtu||)
pĕṁcham̐bĕṁcha nĕṁtainām̐ bĕrugusuṁḍu valabu
vaṁchiṁchi pŏluganīm̐du valabu
aṁchĕla śhrīveṁkaḍeśhum̐ ḍalamelumaṁgam̐gūḍĕ
paṁchasāyaguni rājyabadavi yīvalabu