ఇంతులకు బతులకు నివే తారుకాణలు
(॥పల్లవి॥)
ఇంతులకు బతులకు నివే తారుకాణలు
వింతలేక మెలగేటి వేడుకలే మేలు
(॥॥)
పెక్కుమాట లాడితేను ప్రియములు చప్పనౌను
కక్కసించితే వలపు గడుసుపడు
వెక్కసానఁ జెనకితే విరుగు నట్టె మనసు
యెక్కువ తక్కువ లేని యిచ్చకమే మేలు
(॥॥)
వట్టిపంతా లాడితేను వడిఁబడుఁ జలములు
వెట్టగాఁగ నవ్వితేను వేసటలౌను
బెట్టుగాఁ గొసరితేను బెండుపడుఁ దమకము
గుట్టుతోడఁ బొందుసేసేగుణమే మేలు
(॥॥)
కడువెంగే లాడితేను కాఁతాళము లెసఁగు
యెడయనిసిగ్గులై తే నింపు వుట్టదు
అడరి శ్రీవేంకటేశుఁ డాదరించి నిన్ను నేలె
విడువకు చెలి నీకు వినయమే మేలు
(||pallavi||)
iṁtulagu badulagu nive tārugāṇalu
viṁtalega mĕlageḍi veḍugale melu
(||||)
pĕkkumāḍa lāḍidenu priyamulu sappanaunu
kakkasiṁchide valabu gaḍusubaḍu
vĕkkasānam̐ jĕnagide virugu naṭṭĕ manasu
yĕkkuva takkuva leni yichchagame melu
(||||)
vaṭṭibaṁtā lāḍidenu vaḍim̐baḍum̐ jalamulu
vĕṭṭagām̐ga navvidenu vesaḍalaunu
bĕṭṭugām̐ gŏsaridenu bĕṁḍubaḍum̐ damagamu
guṭṭudoḍam̐ bŏṁduseseguṇame melu
(||||)
kaḍuvĕṁge lāḍidenu kām̐tāḽamu lĕsam̐gu
yĕḍayanisiggulai te niṁpu vuṭṭadu
aḍari śhrīveṁkaḍeśhum̐ ḍādariṁchi ninnu nelĕ
viḍuvagu sĕli nīgu vinayame melu