(॥పల్లవి॥)
ఇంతులట మగఁడట యేల మానేరు
వింతలుగ నీవెంత వేసాలు సేసేవే
(॥ఇంతు॥)
సలిగెగలుగువారు జంకింతురు రమణుని
వలచినవారు రవ్వలు సేతురు
బలిమిగలుగువారు పైపైఁబెనఁగుదురు
నిలుచుండి చూచిచూచి నీవేల దూరేవే
(॥ఇంతు॥)
మనసెనసినవారు మందెమేళాలు సేతురు
ననుపైనవారు చెనకవత్తురు
తనియనివారు సంతతముఁ గొనరుదురు
వనితరో నీ వేల వాసులురేఁచేవే
(॥ఇంతు॥)
మేనవారయినవారు మించి యేమైనాఁ జేతురు
పూని మరిగినవారు పొదుగుదురు
యీనెపాన శ్రీవేంకటేశుఁ డిట్టె నన్నుఁ గూడె
నానఁబెట్టుకొని నీవు నవ్వు లేమి నవ్వేవే
(||pallavi||)
iṁtulaḍa magam̐ḍaḍa yela māneru
viṁtaluga nīvĕṁta vesālu seseve
(||iṁtu||)
saligĕgaluguvāru jaṁkiṁturu ramaṇuni
valasinavāru ravvalu seduru
balimigaluguvāru paibaim̐bĕnam̐guduru
nilusuṁḍi sūsisūsi nīvela dūreve
(||iṁtu||)
manasĕnasinavāru maṁdĕmeḽālu seduru
nanubainavāru sĕnagavatturu
taniyanivāru saṁtadamum̐ gŏnaruduru
vanidaro nī vela vāsulurem̐seve
(||iṁtu||)
menavārayinavāru miṁchi yemainām̐ jeduru
pūni mariginavāru pŏduguduru
yīnĕbāna śhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ nannum̐ gūḍĕ
nānam̐bĕṭṭugŏni nīvu navvu lemi navveve