Imtulaala soodare yeedani yegasakkelu

ఇంతులాల చూడరే యీతని యెగసక్కేలు
Language

(॥పల్లవి॥)
ఇంతులాల చూడరే యీతని యెగసక్కేలు
రంతుసేసి వీఁపు గానరాఁగాఁ దాఁగీని

(॥॥)
ఆనలువెట్టఁగనేలే ఆనోరి పెదవుల
కానుకలై లచ్చనలు గానరాఁగాను
మోనాన నుండఁగనేలే ముంచినయాగుట్టుతోనే
ధ్యాన మాపెమీఁదట తగలై యుండఁ గను

(॥॥)
బొమ్మల జంకించనేలే పూఁచి యానొసలనె
కమ్మి లత్తుక చిహ్నలు గానరాఁ గాను
ఇమ్ములను నిట్టచూపులేలే యాకన్నుల
కమ్మినమదరాగము గప్పియిండఁగను

(॥॥)
అప్పటిఁ బెనఁగనేలే ఆయురముమీఁ దనే
ముప్పురిఁ జన్నులంటినముద్ర లుండఁగను
యిప్పుడె శ్రీవేంకటేశుఁ డిటు తానె నన్నుఁ గూడె
యెప్పుడ నాపెఁ దాను యెనసి వుండఁ గను

(||pallavi||)
iṁtulāla sūḍare yīdani yĕgasakkelu
raṁtusesi vīm̐pu gānarām̐gām̐ dām̐gīni

(||||)
ānaluvĕṭṭam̐ganele ānori pĕdavula
kānugalai lachchanalu gānarām̐gānu
monāna nuṁḍam̐ganele muṁchinayāguṭṭudone
dhyāna mābĕmīm̐daḍa tagalai yuṁḍam̐ ganu

(||||)
bŏmmala jaṁkiṁchanele pūm̐si yānŏsalanĕ
kammi lattuga sihnalu gānarām̐ gānu
immulanu niṭṭasūbulele yāgannula
kamminamadarāgamu gappiyiṁḍam̐ganu

(||||)
appaḍim̐ bĕnam̐ganele āyuramumīm̐ dane
muppurim̐ jannulaṁṭinamudra luṁḍam̐ganu
yippuḍĕ śhrīveṁkaḍeśhum̐ ḍiḍu tānĕ nannum̐ gūḍĕ
yĕppuḍa nābĕm̐ dānu yĕnasi vuṁḍam̐ ganu