Imtulaala soodare yeduvamtivaam didamdu

ఇంతులాల చూడరే యెటువంటివాఁ డితఁడు
Language

(॥పల్లవి॥)
ఇంతులాల చూడరే యెటువంటివాఁ డితఁడు
అంతటిలో నేమిటికి నానవెట్టుకొనినే

(॥ఇంతు॥)
తగవులు చెప్పఁగాను తనిసి వూఁకొంటిఁగాక
యెగసక్కెము చేసేనా యెంతైనాను
మగువనైతేనే తనమర్మము నేనెఱఁగనా
జిగిమించ తానేల సిగ్గువడీనే

(॥ఇంతు॥)
దండనే కూచుండఁగాను తప్పక చూచితిఁ గాక
చండి పెట్టి వెంగెముగా సాదించితినా
నిండిన జవ్వనినైతేనే తన్ను జంకించేనా
దండిగలవాఁడిందుకు తలవంచనేఁటికి

(॥ఇంతు॥)
చనవిచ్చి కూడఁగాను చన్నుల నొత్తితిఁగాక
మొనలు పైఁ జూపేనా మొక్కలానను
వనిత నేనైతేనే వాసులకు మీరేనా
యెనసె శ్రీ వేంకటేశుఁ డేల వేఁడుకొనీనే

(||pallavi||)
iṁtulāla sūḍare yĕḍuvaṁṭivām̐ ḍidam̐ḍu
aṁtaḍilo nemiḍigi nānavĕṭṭugŏnine

(||iṁtu||)
tagavulu sĕppam̐gānu tanisi vūm̐kŏṁṭim̐gāga
yĕgasakkĕmu sesenā yĕṁtainānu
maguvanaidene tanamarmamu nenĕṟam̐ganā
jigimiṁcha tānela sigguvaḍīne

(||iṁtu||)
daṁḍane kūsuṁḍam̐gānu tappaga sūsidim̐ gāga
saṁḍi pĕṭṭi vĕṁgĕmugā sādiṁchidinā
niṁḍina javvaninaidene tannu jaṁkiṁchenā
daṁḍigalavām̐ḍiṁdugu talavaṁchanem̐ṭigi

(||iṁtu||)
sanavichchi kūḍam̐gānu sannula nŏttidim̐gāga
mŏnalu paim̐ jūbenā mŏkkalānanu
vanida nenaidene vāsulagu mīrenā
yĕnasĕ śhrī veṁkaḍeśhum̐ ḍela vem̐ḍugŏnīne