ఇంతులాల చూడరవ్మ యెటువంటి తమకవెూ
(॥పల్లవి॥)
ఇంతులాల చూడరవ్మ యెటువంటి తమకవెూ
ఇంతలేకుండితే నిది యేఁటి జాణతనమే
(॥॥)
పొలఁతి రూప మితఁడు బొమ్మ చేసి మోము చూచి
తలపోసి గోడ చిత్తరువు వ్రాసి
పలుమారు నప్పటిని బయలులో భావించి
అలరి అట్టె భ్రమసి కలలోనఁ గనీని
(॥॥)
వనిత చక్కదనము వర్ణించి నవ్వు నవ్వి
తనలోనే మాటలాడి తప్పక చూచి
వెనుకొని చప్పుడైతే వీనుల నాలకించి
వినయాన మూలమూల వెదకి చేఁచాచీని
(॥॥)
వావి దానే యేర్పరచి వలపు పై జల్లుకొని
మోవి తేనెకు నోరూరి ముంచు గుక్కిళ్లు
శ్రీ వేంకటేశుఁడే తాను చెలి యలమేలుమంగ
వేవేగ నురమెక్కఁగా వేమారు గూడీని
(||pallavi||)
iṁtulāla sūḍaravma yĕḍuvaṁṭi tamagavĕూ
iṁtaleguṁḍide nidi yem̐ṭi jāṇadaname
(||||)
pŏlam̐ti rūba midam̐ḍu bŏmma sesi momu sūsi
talabosi goḍa sittaruvu vrāsi
palumāru nappaḍini bayalulo bhāviṁchi
alari aṭṭĕ bhramasi kalalonam̐ ganīni
(||||)
vanida sakkadanamu varṇiṁchi navvu navvi
tanalone māḍalāḍi tappaga sūsi
vĕnugŏni sappuḍaide vīnula nālagiṁchi
vinayāna mūlamūla vĕdagi sem̐sāsīni
(||||)
vāvi dāne yerbarasi valabu pai jallugŏni
movi tenĕgu norūri muṁchu gukkiḽlu
śhrī veṁkaḍeśhum̐ḍe tānu sĕli yalamelumaṁga
vevega nuramĕkkam̐gā vemāru gūḍīni