ఇంతుల చేఁతకు లోనే యెప్పుడును మగవాఁడు
(॥పల్లవి॥)
ఇంతుల చేఁతకు లోనే యెప్పుడును మగవాఁడు
యింతేసి పంతాలు మాతో నేలాడేవయ్యా
(॥॥)
కన్నులఁ జూచినయాస కాఁగిటికిఁ బెనఁ గించు
సన్నలు సేసినయాస సంగడిఁ బెట్టు
చన్నులుసోఁకినయాస సమరతి కొనగూర్చు
యిన్నేసి మాతో నేరా లేలాడేవయ్యా
(॥॥)
మాటలాడించిన యాస మర్మములు గరఁగించు
చోటిచ్చిన యాస రతిఁ జొక్కించును
నాటించిన గోరి యాస ననుపులు వెడరేఁ చు
యీటున నీయాచారాల యెంత చెప్పేవయ్యా
(॥॥)
సరసమాడిన యాస జంట లప్పుడే సేయు
సరుగ నవ్విన యాస చవులు రేఁచు
ఇరవై శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
యెరవుల వెడమాయ లేల సేసేవయ్యా
(||pallavi||)
iṁtula sem̐tagu lone yĕppuḍunu magavām̐ḍu
yiṁtesi paṁtālu mādo nelāḍevayyā
(||||)
kannulam̐ jūsinayāsa kām̐giḍigim̐ bĕnam̐ giṁchu
sannalu sesinayāsa saṁgaḍim̐ bĕṭṭu
sannulusom̐kinayāsa samaradi kŏnagūrsu
yinnesi mādo nerā lelāḍevayyā
(||||)
māḍalāḍiṁchina yāsa marmamulu garam̐giṁchu
soḍichchina yāsa radim̐ jŏkkiṁchunu
nāḍiṁchina gori yāsa nanubulu vĕḍarem̐ su
yīḍuna nīyāsārāla yĕṁta sĕppevayyā
(||||)
sarasamāḍina yāsa jaṁṭa lappuḍe seyu
saruga navvina yāsa savulu rem̐su
iravai śhrīveṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
yĕravula vĕḍamāya lela sesevayyā