ఇంతుల మంచిగుణాలు యెఱఁగవింతే కాక
(॥పల్లవి॥)
ఇంతుల మంచిగుణాలు యెఱఁగవింతే కాక
కాంతుఁడ వాకె మనసు గనుకొనరాదా
(॥॥)
పిమ్మట దొరైన చెలి ప్రియములు చెప్పుఁగాక
యెమ్మెలాడుకొనునా యేడనై నాను
కమ్మి వలపు గలితే కానుకలంపుగాక
దొమ్మిమాట లాడిడి దరవచ్చునా
(॥॥)
పాయలేనితి యిట్టే బాతిపడి నవ్వుగాక
చాయల సన్నలట్టే సాదించునా
చేయి నమ్మితే నిట్టే సేవలు సేసుఁగాక
కాయకపు సుద్దులకు కాఁతాళించఁ జూచునా
(॥॥)
రతికి లోనైనయాకె రమ్మని పిలుచుఁగాక
తతిగొని పెనఁగునా తన్నుఁ దానే
యితవై శ్రీవేంకటేశ యేలితివి నన్నునిట్టే
సతమైన పనులకు జాడలు వేరౌనా
(||pallavi||)
iṁtula maṁchiguṇālu yĕṟam̐gaviṁte kāga
kāṁtum̐ḍa vāgĕ manasu ganugŏnarādā
(||||)
pimmaḍa dŏraina sĕli priyamulu sĕppum̐gāga
yĕmmĕlāḍugŏnunā yeḍanai nānu
kammi valabu galide kānugalaṁpugāga
dŏmmimāḍa lāḍiḍi daravachchunā
(||||)
pāyalenidi yiṭṭe bādibaḍi navvugāga
sāyala sannalaṭṭe sādiṁchunā
seyi nammide niṭṭe sevalu sesum̐gāga
kāyagabu suddulagu kām̐tāḽiṁcham̐ jūsunā
(||||)
radigi lonainayāgĕ rammani pilusum̐gāga
tadigŏni pĕnam̐gunā tannum̐ dāne
yidavai śhrīveṁkaḍeśha yelidivi nannuniṭṭe
sadamaina panulagu jāḍalu veraunā