Imtu lemeruguduru innee norusugovayya

ఇంతు లేమెరుగుదురు ఇన్నీ నోరుచుకోవయ్య
Language

(॥పల్లవి॥)
ఇంతు లేమెరుగుదురు ఇన్నీ నోరుచుకోవయ్య
యెంతైనా నీకుఁ బోదు యేలేటివాఁడవు

(॥ఇంతు॥)
సవతులజగడాలు సారె దిద్దఁబోతేను
రవళితో దూరుదురు రమణునిని
వివరముగా మరి వేఁడుకొనఁబోతేను
చివుకురంటాఁ బైని చేతులు చాఁతురు

(॥ఇంతు॥)
కచ్చుపెట్టి విడేలిచ్చి కలపఁగఁబోతేను
యెచ్చుగుందు లెంతురు యెగ్గులు వట్టి
గచ్చులుసేసి యట్టె కాఁగిలించఁబోతేను
పచ్చారుతా మంచాలపైఁ బవ్వళించివుందురు

(॥ఇంతు॥)
అంతలో నీ విద్దరి నండఁబెట్టుకోఁ బోతే
పంతాన నొట్లువెట్టి పచారింతురు
బంతినే యలమేల్ మంగపతివి శ్రీవేంకటేశ
కాంతలఁ గూడితి విఁకఁ గడు నిన్ను మెత్తురు

(||pallavi||)
iṁtu lemĕruguduru innī norusugovayya
yĕṁtainā nīgum̐ bodu yeleḍivām̐ḍavu

(||iṁtu||)
savadulajagaḍālu sārĕ diddam̐bodenu
ravaḽido dūruduru ramaṇunini
vivaramugā mari vem̐ḍugŏnam̐bodenu
sivuguraṁṭām̐ baini sedulu sām̐turu

(||iṁtu||)
kachchubĕṭṭi viḍelichchi kalabam̐gam̐bodenu
yĕchchuguṁdu lĕṁturu yĕggulu vaṭṭi
gachchulusesi yaṭṭĕ kām̐giliṁcham̐bodenu
pachchārudā maṁchālabaim̐ bavvaḽiṁchivuṁduru

(||iṁtu||)
aṁtalo nī viddari naṁḍam̐bĕṭṭugom̐ bode
paṁtāna nŏṭluvĕṭṭi pasāriṁturu
baṁtine yalamel maṁgabadivi śhrīveṁkaḍeśha
kāṁtalam̐ gūḍidi vim̐kam̐ gaḍu ninnu mĕtturu