ఇంతో నేఁ డిట్టె తోఁచె నిది యొక్కకాలము
(॥పల్లవి॥)
ఇంతో నేఁ డిట్టె తోఁచె నిది యొక్కకాలము
కాంత కిన్నియు మేలుకాల మాయనే
(॥ఇంత॥)
కన్నుఁగొనల నిదివో కారుమెరుఁగులు మించె
వున్నతి తురుముమేఘ ముదఇంచెను
సన్నపుచెక్కుచెమట జడినట్టి కురిసీని
కన్నెభావ మిది వానకాలమాయనే
(॥ఇంత॥)
తలపోఁత విరహపుతాపపుటెండలు గానె
వెలయ నూరుపుగాలి విసరీని
తలచూపరాక చిత్తజునిపౌఁజులు మూఁగి
కలికిమై వేసవి కాల మాయనే
(॥ఇంత॥)
సంతమై శ్రీవేంకటేశ్వరుఁడు గూడఁగ నిదె
మంతనపుఁబులకల మంచు ముంచెనే
చింత లిన్నియునుఁ బాసి చిత్తములు చెంగలించె
కాంతచందము చలికాల మాయనే
(||pallavi||)
iṁto nem̐ ḍiṭṭĕ tom̐sĕ nidi yŏkkagālamu
kāṁta kinniyu melugāla māyane
(||iṁta||)
kannum̐gŏnala nidivo kārumĕrum̐gulu miṁchĕ
vunnadi turumumegha muda̮iṁchĕnu
sannabusĕkkusĕmaḍa jaḍinaṭṭi kurisīni
kannĕbhāva midi vānagālamāyane
(||iṁta||)
talabom̐ta virahabudābabuḍĕṁḍalu gānĕ
vĕlaya nūrubugāli visarīni
talasūbarāga sittajunibaum̐julu mūm̐gi
kaligimai vesavi kāla māyane
(||iṁta||)
saṁtamai śhrīveṁkaḍeśhvarum̐ḍu gūḍam̐ga nidĕ
maṁtanabum̐bulagala maṁchu muṁchĕne
siṁta linniyunum̐ bāsi sittamulu sĕṁgaliṁchĕ
kāṁtasaṁdamu saligāla māyane