ఇంతియయిన ఫలము యింతటిది గావలదా
(॥పల్లవి॥)
ఇంతియయిన ఫలము యింతటిది గావలదా
పంతపు నిన్నుఁ దన బంబుఁ జేసినది
(॥ఇంతి॥)
తెలిగన్ను లరమోడ్చి తేరకొన నినుఁ జూచి
చలిమోవి యటు చూపి సన్న చేసి
యెలయించి పానుపున కింతలో నినుఁ దీసె
నలరుఁ గాంతలలోన నదియ పో జాణా
(॥ఇంతి॥)
చిఱుఁజెమట నొసలితో సెలవిఁ బారఁగ నవ్వి
కఱకుమర్మము గొంతుకాడఁ బలికి
తఱి నీ మనసు గరఁచి తనమీఁద నొరగించె
నెఱతనం బిది యెంత నేర్చెనో చెలియా
(॥ఇంతి॥)
సారె జాఁరు దురుము నిలిపి చనుమొనలఁదాఁకించి
వోరి కోట్లఁదనవుదుటు చూపి
యీరీతి శ్రీవేంకటేశ నినుఁ గలసెఁ జెలి
యీ రమణి కిఁక సరి యెంచ మరి కలదా
(||pallavi||)
iṁtiyayina phalamu yiṁtaḍidi gāvaladā
paṁtabu ninnum̐ dana baṁbum̐ jesinadi
(||iṁti||)
tĕligannu laramoḍchi teragŏna ninum̐ jūsi
salimovi yaḍu sūbi sanna sesi
yĕlayiṁchi pānubuna kiṁtalo ninum̐ dīsĕ
nalarum̐ gāṁtalalona nadiya po jāṇā
(||iṁti||)
siṟum̐jĕmaḍa nŏsalido sĕlavim̐ bāram̐ga navvi
kaṟagumarmamu gŏṁtugāḍam̐ baligi
taṟi nī manasu garam̐si tanamīm̐da nŏragiṁchĕ
nĕṟadanaṁ bidi yĕṁta nersĕno sĕliyā
(||iṁti||)
sārĕ jām̐ru durumu nilibi sanumŏnalam̐dām̐kiṁchi
vori koṭlam̐danavuduḍu sūbi
yīrīdi śhrīveṁkaḍeśha ninum̐ galasĕm̐ jĕli
yī ramaṇi kim̐ka sari yĕṁcha mari kaladā