ఇంటివారి చేఁతలు యింపు వుట్టీనా
(॥పల్లవి॥)
ఇంటివారి చేఁతలు యింపు వుట్టీనా
గొంటుతనమున యేల కొసరేవు నీవు
(॥ఇంటి॥)
పన్ని నీవు వలచినపడఁతి నీకు యేమాట
విన్నపముసేసినాను విందువు గాక
మన్నన గలిగినాపె మరియెంత జంకించి
సన్నలు చేసినానుఁ జవువౌఁ గాక
(॥ఇంటి॥)
బాస చేయించుకొన్నా పె పనులెంత చెప్పినాను
చేసూటికి లోనై చేతువుగాక
ఆసకొలిపి రప్పించినాపె యేమిసేసినాను
వోసరించి అన్నిటికి నోర్తువుగాక
(॥ఇంటి॥)
నీవుగాఁగిలించినాపె నీటులెంత చూపినాను
కైవసమై మెచ్చి మెచ్చి కందువుగాక
యీ వల శ్రీవేంకటేశ యేలితివి నన్నునేఁడు
సేవ చేసి నే నెట్టున్నాఁ జేకొందువు గాక
(||pallavi||)
iṁṭivāri sem̐talu yiṁpu vuṭṭīnā
gŏṁṭudanamuna yela kŏsarevu nīvu
(||iṁṭi||)
panni nīvu valasinabaḍam̐ti nīgu yemāḍa
vinnabamusesinānu viṁduvu gāga
mannana galiginābĕ mariyĕṁta jaṁkiṁchi
sannalu sesinānum̐ javuvaum̐ gāga
(||iṁṭi||)
bāsa seyiṁchugŏnnā pĕ panulĕṁta sĕppinānu
sesūḍigi lonai seduvugāga
āsagŏlibi rappiṁchinābĕ yemisesinānu
vosariṁchi anniḍigi norduvugāga
(||iṁṭi||)
nīvugām̐giliṁchinābĕ nīḍulĕṁta sūbinānu
kaivasamai mĕchchi mĕchchi kaṁduvugāga
yī vala śhrīveṁkaḍeśha yelidivi nannunem̐ḍu
seva sesi ne nĕṭṭunnām̐ jegŏṁduvu gāga