ఇంతిరో యిట్లనైతే యేమి సేసేనే
(॥పల్లవి॥)
ఇంతిరో యిట్లనైతే యేమి సేసేనే
మంతనాన పతి వీఁడే మరి యేమనేనే
(॥ఇంతి॥)
అప్పుడే నే నననా ఆతఁడిందుకు వచ్చితే
వొప్పనతో మొగమోడి వుండుదునని
తప్పుదేర నాడనుండే తగినట్టెల్లా నాడక
నెప్పున యీడకుఁ దెస్తే నే నేమనేనే
(॥ఇంతి॥)
చేత సన్న నేయ నాచెఱఁ గిట్టే పట్టితే-
నాతల నేఁ బరవశ మందుదునని
పై తరవై ఆడనుండే వంతములు వుచ్చుకోక
యీతల నన్నాడుమంటే యిఁక నేమనేనే
(॥ఇంతి॥)
నెలవి నే నవ్వనా శ్రీవేంకటేశ్వరుఁడు
కలసితేఁ గరఁగుదు కమ్మర నని
తొలుతనే ఆడవైతి దూరకువే యిఁకనేమి
నిలిచితి మిద్దరమూ నిన్ను నేనునేమే
(||pallavi||)
iṁtiro yiṭlanaide yemi sesene
maṁtanāna padi vīm̐ḍe mari yemanene
(||iṁti||)
appuḍe ne nananā ādam̐ḍiṁdugu vachchide
vŏppanado mŏgamoḍi vuṁḍudunani
tappudera nāḍanuṁḍe taginaṭṭĕllā nāḍaga
nĕppuna yīḍagum̐ dĕste ne nemanene
(||iṁti||)
seda sanna neya nāsĕṟam̐ giṭṭe paṭṭide-
nādala nem̐ baravaśha maṁdudunani
pai taravai āḍanuṁḍe vaṁtamulu vuchchugoga
yīdala nannāḍumaṁṭe yim̐ka nemanene
(||iṁti||)
nĕlavi ne navvanā śhrīveṁkaḍeśhvarum̐ḍu
kalasidem̐ garam̐gudu kammara nani
tŏludane āḍavaidi dūraguve yim̐kanemi
nilisidi middaramū ninnu nenuneme