ఇంతిరో నీపతిని నీవేమి సేసినా నేమాయ
(॥పల్లవి॥)
ఇంతిరో నీపతిని నీవేమి సేసినా నేమాయ
కాంతుని వద్దికి రావే కడు సిగ్గులేఁటికి
(॥ఇంతి॥)
కూడి వున్నచోటను కుచ్చితము వద్దుగాని
ఆడరానిమాటలన్నీ నాడవచ్చును
వేడుకే కలిగితేను వేసరుకోవద్దుగాని
జాడతోడ బొమ్మలను జంకించవచ్చును
(॥ఇంతి॥)
కూరిమిగల పట్టున గుట్టుసేయవద్దుగాని
నారుకొననెంతైనా నవ్వవచ్చును
మేరతోడిపొందులకు మేకు చూపవద్దుగాని
బీరపు సమ రతులఁ బెనఁగఁగ వచ్చును
(॥ఇంతి॥)
చనవుగల యెడను చలములు వద్దుగాని
వెనుకొని విరులను వేయవచ్చును
చెనకి నన్నిదె కూడె శ్రీ వెంకటేశుఁడు
పొనుఁగఁగ వద్దుగాని భోగించవచ్చును
(||pallavi||)
iṁtiro nībadini nīvemi sesinā nemāya
kāṁtuni vaddigi rāve kaḍu siggulem̐ṭigi
(||iṁti||)
kūḍi vunnasoḍanu kuchchidamu vaddugāni
āḍarānimāḍalannī nāḍavachchunu
veḍuge kaligidenu vesarugovaddugāni
jāḍadoḍa bŏmmalanu jaṁkiṁchavachchunu
(||iṁti||)
kūrimigala paṭṭuna guṭṭuseyavaddugāni
nārugŏnanĕṁtainā navvavachchunu
meradoḍibŏṁdulagu megu sūbavaddugāni
bīrabu sama radulam̐ bĕnam̐gam̐ga vachchunu
(||iṁti||)
sanavugala yĕḍanu salamulu vaddugāni
vĕnugŏni virulanu veyavachchunu
sĕnagi nannidĕ kūḍĕ śhrī vĕṁkaḍeśhum̐ḍu
pŏnum̐gam̐ga vaddugāni bhogiṁchavachchunu