ఇంతిరో నీ వున్నభావ మెట్టు చూతునే
(॥పల్లవి॥)
ఇంతిరో నీ వున్నభావ మెట్టు చూతునే
పంతపు నీ తప సింక పండు టెన్నఁడే
(॥ఇంతిరో॥)
చెలిమీఁద నొరగుండి చెక్కుమీఁదఁ జేయివెట్టి
వలపువేదన నేల వసివాడవే
యెలమిఁ జెఱకువిల్లు యెక్కువెట్టి యేయఁ జొచ్చే
వలరాచపగ యెటువలె నీఁగెనె
(॥ఇంతిరో॥)
తమ్మిమోము గడు వంచి తత్తరాలే పచరించి
వుమ్మచెమటల నేల వుస్సు రనేవే
దిమ్ముల యాసలు రేఁచి తేనెలు మోవి నూరించె
యెమ్మెల జవ్వనభార మెట్టు మోచేవే
(॥ఇంతిరో॥)
పొంది కలువల పోసి భోగించేపానుపు చూచి
యిందరిలో నీకు నీకే యేల వుబ్బేవే
బెంది యలమేలుమంగ శ్రీవేంకటేశుఁ గూడితి
విందు నీ కళలసాంపు లెందు దాఁచేవే
(||pallavi||)
iṁtiro nī vunnabhāva mĕṭṭu sūdune
paṁtabu nī taba siṁka paṁḍu ṭĕnnam̐ḍe
(||iṁtiro||)
sĕlimīm̐da nŏraguṁḍi sĕkkumīm̐dam̐ jeyivĕṭṭi
valabuvedana nela vasivāḍave
yĕlamim̐ jĕṟaguvillu yĕkkuvĕṭṭi yeyam̐ jŏchche
valarāsabaga yĕḍuvalĕ nīm̐gĕnĕ
(||iṁtiro||)
tammimomu gaḍu vaṁchi tattarāle pasariṁchi
vummasĕmaḍala nela vussu raneve
dimmula yāsalu rem̐si tenĕlu movi nūriṁchĕ
yĕmmĕla javvanabhāra mĕṭṭu moseve
(||iṁtiro||)
pŏṁdi kaluvala posi bhogiṁchebānubu sūsi
yiṁdarilo nīgu nīge yela vubbeve
bĕṁdi yalamelumaṁga śhrīveṁkaḍeśhum̐ gūḍidi
viṁdu nī kaḽalasāṁpu lĕṁdu dām̐seve