Imtiro nee kela simta yimtalo panigimgaa

ఇంతిరో నీ కేల చింత యింతలో పనికిఁగా
Language

(॥పల్లవి॥)
ఇంతిరో నీ కేల చింత యింతలో పనికిఁగా
వింతగా మరేమనినా వినఁబొయ్యేరా

(॥ఇంతి॥)
పచ్చిగా వలచినట్టి పతికినీ సతికిని
విచ్చనవిళ్ళే కాక వెఱ పున్నదా
యెచ్చుకుందులైన బుద్దు లెవ్వ రెంత చెప్పినాను
మచ్చరమై తోఁచుఁ గాకఁమానఁ బొయ్యేరా

(॥ఇంతి॥)
జవ్వనభారముచేత జడిసేటి విరహులు
యివ్వల నెగ్గులు సిగ్దు లెఱుఁగుదురా
రవ్వలుగా నింటివారు రాయ డెంత చేసినాను
మవ్వపు తెగుమో కాక మానఁబొయ్యేరా

(॥ఇంతి॥)
యెక్కువ శ్రీవేంకటేశుఁడెవ్వరిఁ జేపట్టి నాను
గక్కన మన్నించుఁ గాక కడ మయ్యీనా
నిక్కి నీకడకు వచ్చి నిన్నుఁగరఁగించి కూడె
చక్కని మీరిద్దరిలో జవదాఁటేరా

(||pallavi||)
iṁtiro nī kela siṁta yiṁtalo panigim̐gā
viṁtagā maremaninā vinam̐bŏyyerā

(||iṁti||)
pachchigā valasinaṭṭi padiginī sadigini
vichchanaviḽḽe kāga vĕṟa punnadā
yĕchchuguṁdulaina buddu lĕvva rĕṁta sĕppinānu
machcharamai tom̐sum̐ gāgam̐mānam̐ bŏyyerā

(||iṁti||)
javvanabhāramuseda jaḍiseḍi virahulu
yivvala nĕggulu sigdu lĕṟum̐gudurā
ravvalugā niṁṭivāru rāya ḍĕṁta sesinānu
mavvabu tĕgumo kāga mānam̐bŏyyerā

(||iṁti||)
yĕkkuva śhrīveṁkaḍeśhum̐ḍĕvvarim̐ jebaṭṭi nānu
gakkana manniṁchum̐ gāga kaḍa mayyīnā
nikki nīgaḍagu vachchi ninnum̐garam̐giṁchi kūḍĕ
sakkani mīriddarilo javadām̐ṭerā