Imtinela neraalemchevu neevu

ఇంతినేల నేరాలెంచేవు నీవు
Language

(॥పల్లవి॥)
ఇంతినేల నేరాలెంచేవు నీవు
జంతలవలెనే నీతో సరసములాడునా

(॥ఇంతి॥)
పిలిచి నిన్నోకమాఁటు పేరుకొంట చాలదా
పలుమారు నుతించునా బట్టువలెను
నెలకొని నీవద్దనిలుచుంట చాలదా
బలిమిఁ బై పడునా వసురమువలెను

(॥ఇంతి॥)
మొక్కె నీకుఁ జేతులెత్తి మొదలనే చాలదా
దిక్కనఁ బాదాలంటునాఁ దీగెవలెను
గక్కున నిన్నుఁ గన్నులఁ గనుఁగొంట చాలదా
మిక్కుటమై చూచునా మించ లేడు(డి?) వలెను

(॥ఇంతి॥)
ఇట్టె కాఁగిలించి నిన్ను నెనయుట చాలదా
పట్టి కడు నురుపునా బంతివలెను
గుట్టున శ్రీవేంకటేశ కొంత నవ్వెఁ జాలదా
తొట్టి సకిళించునా తురగమువలెను

(||pallavi||)
iṁtinela nerālĕṁchevu nīvu
jaṁtalavalĕne nīdo sarasamulāḍunā

(||iṁti||)
pilisi ninnogamām̐ṭu perugŏṁṭa sāladā
palumāru nudiṁchunā baṭṭuvalĕnu
nĕlagŏni nīvaddanilusuṁṭa sāladā
balimim̐ bai paḍunā vasuramuvalĕnu

(||iṁti||)
mŏkkĕ nīgum̐ jedulĕtti mŏdalane sāladā
dikkanam̐ bādālaṁṭunām̐ dīgĕvalĕnu
gakkuna ninnum̐ gannulam̐ ganum̐gŏṁṭa sāladā
mikkuḍamai sūsunā miṁcha leḍu(ḍi?) valĕnu

(||iṁti||)
iṭṭĕ kām̐giliṁchi ninnu nĕnayuḍa sāladā
paṭṭi kaḍu nurubunā baṁtivalĕnu
guṭṭuna śhrīveṁkaḍeśha kŏṁta navvĕm̐ jāladā
tŏṭṭi sagiḽiṁchunā turagamuvalĕnu