ఇంతిఁ గనుఁగొనవయ్యా యెటువంటి మోహమో
(॥పల్లవి॥)
ఇంతిఁ గనుఁగొనవయ్యా యెటువంటి మోహమో
బంతి మోవితేనియల బచ్చి దేరీని
(॥ఇంతి॥)
చన్నులపై పయ్యద జారినదీ నెరఁగదు
నిన్నుఁ జూచే వేడుకను నివ్వెర గంది
వన్నెలఁ జెక్కుచెమట వడిసేది దలఁచదు
వున్నతపుఁ దమకాన నుమ్మగిలీని
(॥ఇంతి॥)
వీఁపునఁ దనతురుము వీడినదీఁ దెలియదు
పై పై నీతో మాటలాడే పరాకునను
రాఁపుల నిట్టూర్పుల రవళి నాలించదు
యేపునఁ బరవశాన నీఁదులాడీని
(॥ఇంతి॥)
వరుసతోఁ బోఁకముడి వదలినదీ నెంచదు
గరిమ సరసమాడే కాతరానను
యిరవై శ్రీ వేంకటేశ యేలితి వీకెను నేఁడు
సిరుల సంతోసానఁ జిమ్మి రేఁగీని
(||pallavi||)
iṁtim̐ ganum̐gŏnavayyā yĕḍuvaṁṭi mohamo
baṁti movideniyala bachchi derīni
(||iṁti||)
sannulabai payyada jārinadī nĕram̐gadu
ninnum̐ jūse veḍuganu nivvĕra gaṁdi
vannĕlam̐ jĕkkusĕmaḍa vaḍisedi dalam̐sadu
vunnadabum̐ damagāna nummagilīni
(||iṁti||)
vīm̐punam̐ danadurumu vīḍinadīm̐ dĕliyadu
pai pai nīdo māḍalāḍe parāgunanu
rām̐pula niṭṭūrbula ravaḽi nāliṁchadu
yebunam̐ baravaśhāna nīm̐dulāḍīni
(||iṁti||)
varusadom̐ bom̐kamuḍi vadalinadī nĕṁchadu
garima sarasamāḍe kādarānanu
yiravai śhrī veṁkaḍeśha yelidi vīgĕnu nem̐ḍu
sirula saṁtosānam̐ jimmi rem̐gīni