Imtiloni kemgarayya iddaru meeru

ఇంటిలోని కేఁగరయ్య ఇద్దరు మీరు
Language

(॥పల్లవి॥)
ఇంటిలోని కేఁగరయ్య ఇద్దరు మీరు
పంటలవలె నిందేల పచరించ నిపుడు

(॥ఇంటి॥)
మాటలాడఁ బోతేను మాణికేలు రాలీని
కాటుక కన్నులనైతేఁ గారీ నీలాలు
యేఁటికి నీవు రేఁచేవు ఇంతివొళ్ళఁ గలదిది
మూటలు గట్టఁగరావు ముంగిలెల్లా నిండెను

(॥ఇంటి॥)
చేతులెత్తి మొక్కితేను చిగురులే తొలఁకీని
ఆతల నవ్వితే మొల్లలటు మించీని
కాతరించి పట్టేవు కామిన సింగారమింతే
జాతి దండగట్టరావు సముకాన నిండెను టపఁ

(॥ఇంటి॥)
సంగడిఁ గూచండితే చక్కెరే వుట్టిపడీని
అంగము సోఁకితే నూరీ నమృతములు
సంగతిగాఁ గూడితివి సతిని శ్రీ వెంకటేశ
కొంగునఁ గట్టఁగరాదు కోరికెల్లా నిండెను

(||pallavi||)
iṁṭiloni kem̐garayya iddaru mīru
paṁṭalavalĕ niṁdela pasariṁcha nibuḍu

(||iṁṭi||)
māḍalāḍam̐ bodenu māṇigelu rālīni
kāḍuga kannulanaidem̐ gārī nīlālu
yem̐ṭigi nīvu rem̐sevu iṁtivŏḽḽam̐ galadidi
mūḍalu gaṭṭam̐garāvu muṁgilĕllā niṁḍĕnu

(||iṁṭi||)
sedulĕtti mŏkkidenu sigurule tŏlam̐kīni
ādala navvide mŏllalaḍu miṁchīni
kādariṁchi paṭṭevu kāmina siṁgāramiṁte
jādi daṁḍagaṭṭarāvu samugāna niṁḍĕnu ṭabam̐

(||iṁṭi||)
saṁgaḍim̐ gūsaṁḍide sakkĕre vuṭṭibaḍīni
aṁgamu som̐kide nūrī namṛtamulu
saṁgadigām̐ gūḍidivi sadini śhrī vĕṁkaḍeśha
kŏṁgunam̐ gaṭṭam̐garādu korigĕllā niṁḍĕnu