Imtilone vumdenu yimpudanagu meemdetti

ఇంటిలోనే వుండేను యింపుదనకు మీఁదెత్తి
Language

(॥పల్లవి॥)
ఇంటిలోనే వుండేను యింపుదనకు మీఁదెత్తి
కంటకము లేక వూడిగము గొననీవే

(॥ఇంటి॥)
నగఁగా నెట్లనో నాండ్లేలేదొరతోడ
మొగము చూడఁగా నేడ వెగట్లౌనో
బిగువుఁ జన్నుల నొత్తి పెనఁగితే నేపంతమో
అగడు సేయక బుద్ధి ఆనతిమ్మనఁగదే

(॥ఇంటి॥)
మాటలాడఁగా నెట్టో మదించినవానితోడ
గాఁటాన విడె మియ్యఁగా కార మెంతౌనో
కాటుక కన్నులఁ జూడఁగా నేడఁ దాఁకునో
ఆఁటదాన నాకు బుద్ధి అది యిమ్మనఁగదే

(॥ఇంటి॥)
చేరి కొలువఁగా నెట్టో శ్రీ వేంకటేశ్వరుతోడ
మేరతోఁ గూడితే మందెమేళ మెంతౌనో
గారవించి తానె నన్నుఁ గాఁగిలించి మన్నించె
కూరిమితో నింకా నిట్లఁ గూడుండుమనఁగదే

(||pallavi||)
iṁṭilone vuṁḍenu yiṁpudanagu mīm̐dĕtti
kaṁṭagamu lega vūḍigamu gŏnanīve

(||iṁṭi||)
nagam̐gā nĕṭlano nāṁḍleledŏradoḍa
mŏgamu sūḍam̐gā neḍa vĕgaṭlauno
biguvum̐ jannula nŏtti pĕnam̐gide nebaṁtamo
agaḍu seyaga buddhi ānadimmanam̐gade

(||iṁṭi||)
māḍalāḍam̐gā nĕṭṭo madiṁchinavānidoḍa
gām̐ṭāna viḍĕ miyyam̐gā kāra mĕṁtauno
kāḍuga kannulam̐ jūḍam̐gā neḍam̐ dām̐kuno
ām̐ṭadāna nāgu buddhi adi yimmanam̐gade

(||iṁṭi||)
seri kŏluvam̐gā nĕṭṭo śhrī veṁkaḍeśhvarudoḍa
meradom̐ gūḍide maṁdĕmeḽa mĕṁtauno
gāraviṁchi tānĕ nannum̐ gām̐giliṁchi manniṁchĕ
kūrimido niṁkā niṭlam̐ gūḍuṁḍumanam̐gade