Imtijavvanavanaana ninniyu nelagonenu

ఇంతిజవ్వనవనాన నిన్నియు నెలకొనెను
Language

(॥పల్లవి॥)
ఇంతిజవ్వనవనాన నిన్నియు నెలకొనెను
వంతులవాసులతోడ వలరాచపౌఁజులు

(॥ఇంతి॥)
కుతిలాలు మాని సరిఁ గూచున్నవి చూడవే
సతి యురముమీఁదట చక్రవాకాలు
గతిగూడ గుంపుగట్టి కాఁపురము సేసీనవే
మితిమీరి శిరసుపై మేఁటితుమ్మిదలు

(॥ఇంతి॥)
కలికితనాలతోఁడ గడు మించీఁగదవే
జలజాక్షివమోముననే చకోరములు
పలుకులలోననే పాదుకొనె నిపు డిట్టె
చెలరేఁగి మోవిమీఁద చిలుకమొత్తములు

(॥ఇంతి॥)
తగు శ్రీవేంకటేశ్వరుదండ నిల్చీఁ జూడవే
మగువ నడపులనే మంచిహంసలు
మిగుల రతివేళను మెరసీఁ దా మిన్నిటాను
పగటుఁ గుత్తికలోన పావురములు

(||pallavi||)
iṁtijavvanavanāna ninniyu nĕlagŏnĕnu
vaṁtulavāsuladoḍa valarāsabaum̐julu

(||iṁti||)
kudilālu māni sarim̐ gūsunnavi sūḍave
sadi yuramumīm̐daḍa sakravāgālu
gadigūḍa guṁpugaṭṭi kām̐puramu sesīnave
midimīri śhirasubai mem̐ṭidummidalu

(||iṁti||)
kaligidanāladom̐ḍa gaḍu miṁchīm̐gadave
jalajākṣhivamomunane sagoramulu
palugulalonane pādugŏnĕ nibu ḍiṭṭĕ
sĕlarem̐gi movimīm̐da silugamŏttamulu

(||iṁti||)
tagu śhrīveṁkaḍeśhvarudaṁḍa nilsīm̐ jūḍave
maguva naḍabulane maṁchihaṁsalu
migula radiveḽanu mĕrasīm̐ dā minniḍānu
pagaḍum̐ guttigalona pāvuramulu