Imtigini neegum dagu niduvamti nerubulu

ఇంతికిని నీకుఁ దగు నిటువంటి నేరుపులు
Language

(॥పల్లవి॥)
ఇంతికిని నీకుఁ దగు నిటువంటి నేరుపులు
పొంతఁ గలకాలమును భోగించరయ్యా

(॥ఇంతి॥)
నిలిచి నవ్విన నవ్వు నివ్వెరగు నొందించు
సొలసి చూచిన చూపు చొక్కించును
పిలిచి యాడిన మాఁట ప్రియమెల్లాఁ బుట్టించు
తలఁచి మెచ్చిన మెచ్చు తమిరేఁచును

(॥ఇంతి॥)
చెనకి సేసిన చెలిమి చిత్తంబు గరఁగించు
వినయంబు గలపొందు వెలయించును
పెనఁగి పెట్టిన విందు బెరసి చవి వుట్టించు
ననుపైన సరసంబు నానాఁటఁ బొదలు

(॥ఇంతి॥)
తగిలి వలచిన వలపు తరితీపు వుట్టించు
మొగమోట నెయ్యంబు మొక్కించును
మిగుల శ్రీవేంకటేశ మెలుఁత నిటు గూడితివి
చిగురుఁ గోరికలు మిముఁ జెంగలింపించు

(||pallavi||)
iṁtigini nīgum̐ dagu niḍuvaṁṭi nerubulu
pŏṁtam̐ galagālamunu bhogiṁcharayyā

(||iṁti||)
nilisi navvina navvu nivvĕragu nŏṁdiṁchu
sŏlasi sūsina sūbu sŏkkiṁchunu
pilisi yāḍina mām̐ṭa priyamĕllām̐ buṭṭiṁchu
talam̐si mĕchchina mĕchchu tamirem̐sunu

(||iṁti||)
sĕnagi sesina sĕlimi sittaṁbu garam̐giṁchu
vinayaṁbu galabŏṁdu vĕlayiṁchunu
pĕnam̐gi pĕṭṭina viṁdu bĕrasi savi vuṭṭiṁchu
nanubaina sarasaṁbu nānām̐ṭam̐ bŏdalu

(||iṁti||)
tagili valasina valabu taridību vuṭṭiṁchu
mŏgamoḍa nĕyyaṁbu mŏkkiṁchunu
migula śhrīveṁkaḍeśha mĕlum̐ta niḍu gūḍidivi
sigurum̐ gorigalu mimum̐ jĕṁgaliṁpiṁchu