ఇంటికి విచ్చేసితిని యెంతవనికి
(॥పల్లవి॥)
ఇంటికి విచ్చేసితిని యెంతవనికి
అంటిసుడివంటిదాన నందుకోపేనా
(॥ఇంటి॥)
యెంగిలిమోవిదాన యేడలేనిసిగ్గుదాన
పొంగేటి చెమటలతోఁ బొరలేదాన
వంగనిచన్నులదాన వాడికెవలపుదాన
పంగెనకోపముదాన బాఁతెయ్యేనా
(॥ఇంటి॥)
సన్నపునడిమిదాన పళుపుఁజూపులదాన
వెన్నెలనవ్వులతోడి వీరిడిదాన
నున్నని చెక్కులదాన నూఁగురులకొప్పుదాన
పిన్నదాన నే నీకుఁ బ్రియమయ్యేనా
(॥ఇంటి॥)
చిగురుఁబాదాలదాన చిమ్ముఁజూపులదాన
వెగటుఁబిఱుఁదుగలవేఁకపుదాన
నిగిడి శ్రీవేంకటేశ నీవు నన్నుఁ గూడితివి
జిగిబిగువులదానఁ జిత్తము వచ్చేనా
(||pallavi||)
iṁṭigi vichchesidini yĕṁtavanigi
aṁṭisuḍivaṁṭidāna naṁdugobenā
(||iṁṭi||)
yĕṁgilimovidāna yeḍalenisiggudāna
pŏṁgeḍi sĕmaḍaladom̐ bŏraledāna
vaṁganisannuladāna vāḍigĕvalabudāna
paṁgĕnagobamudāna bām̐tĕyyenā
(||iṁṭi||)
sannabunaḍimidāna paḽubum̐jūbuladāna
vĕnnĕlanavvuladoḍi vīriḍidāna
nunnani sĕkkuladāna nūm̐gurulagŏppudāna
pinnadāna ne nīgum̐ briyamayyenā
(||iṁṭi||)
sigurum̐bādāladāna simmum̐jūbuladāna
vĕgaḍum̐biṟum̐dugalavem̐kabudāna
nigiḍi śhrīveṁkaḍeśha nīvu nannum̐ gūḍidivi
jigibiguvuladānam̐ jittamu vachchenā