ఇంటికి విచ్చేసె నాతఁడేమే నీవు
(॥పల్లవి॥)
ఇంటికి విచ్చేసె నాతఁడేమే నీవు
కంటకములాడేది కాదే నీవు
(॥॥)
ఆగడుఁజెమటతోడ నలసివచ్చినపతి
యెగసక్కేలే యాడే వేమే నీవు
మగవాని మోహ మింత మదివిచ్చి చూడఁబోతే
యిగురువంటి దింతే యేల నీవు
(॥॥)
చెంతల నిన్ను నవ్వించి సిగ్గులెల్లాఁ బాపినాఁడు
యెంతైనా మెచ్చవైతి వేమే నీవు
పంతపు దొరలపొందు పచ్చిగాఁ బిసుకఁబోతే
యింతలోఁ బసురువేసు నిదియాలే నీవు
(॥॥)
నెయ్యాన గడ్డమువంటి నిన్నతఁడు వేఁడుకొనీ
యియ్యకొనవే పనకి యేమే నీవు
తియ్యఁగా శ్రీవేంకటాద్రిదేవునిఁ గూడితి వెట్టె
అయ్యెడ నలమేల్మంగ వునవునే నీవు
(||pallavi||)
iṁṭigi vichchesĕ nādam̐ḍeme nīvu
kaṁṭagamulāḍedi kāde nīvu
(||||)
āgaḍum̐jĕmaḍadoḍa nalasivachchinabadi
yĕgasakkele yāḍe veme nīvu
magavāni moha miṁta madivichchi sūḍam̐bode
yiguruvaṁṭi diṁte yela nīvu
(||||)
sĕṁtala ninnu navviṁchi siggulĕllām̐ bābinām̐ḍu
yĕṁtainā mĕchchavaidi veme nīvu
paṁtabu dŏralabŏṁdu pachchigām̐ bisugam̐bode
yiṁtalom̐ basuruvesu nidiyāle nīvu
(||||)
nĕyyāna gaḍḍamuvaṁṭi ninnadam̐ḍu vem̐ḍugŏnī
yiyyagŏnave panagi yeme nīvu
tiyyam̐gā śhrīveṁkaḍādridevunim̐ gūḍidi vĕṭṭĕ
ayyĕḍa nalamelmaṁga vunavune nīvu