Imtigi vachchinavaamda veedersugovayya

ఇంటికి వచ్చినవాఁడ వీడేర్చుకోవయ్య
Language

(॥పల్లవి॥)
ఇంటికి వచ్చినవాఁడ వీడేర్చుకోవయ్య
జంట గూడినవాఁడవు చనవియ్యవయ్యా

(॥ఇంటి॥)
తరుణి వలచినదే తప్పయితేఁగనక
వురవుగా నీవది వోర్చుకోవయ్యా
మరలి నిన్నుఁ జూచుటే మచ్చరమైతేఁగనక
నిరతితో నందుకొను నీకు మొక్కేనయ్యా

(॥ఇంటి॥)
వెలఁది మాటాడినదే వెంగెములై తేఁగనక
మలసి యీనేరమి మన్నించవయ్యా
అలమిపట్టినదే అపరాధమైతేఁ గన
బలిమిచెల్లఁగ నీకుఁ బంతమిచ్చీనయ్యా

(॥ఇంటి॥)
ఇంతి పాదాలొత్తి నదే యెగ్గులైతేఁ గనక
చెంతనే నేరు పాపెకుఁ జెప్పవయ్యా
కాంతను శ్రీవేంకటేశ కలిసితి వింతలోనె
వింతవింతరతులను వియ్యమందవయ్యా

(||pallavi||)
iṁṭigi vachchinavām̐ḍa vīḍersugovayya
jaṁṭa gūḍinavām̐ḍavu sanaviyyavayyā

(||iṁṭi||)
taruṇi valasinade tappayidem̐ganaga
vuravugā nīvadi vorsugovayyā
marali ninnum̐ jūsuḍe machcharamaidem̐ganaga
niradido naṁdugŏnu nīgu mŏkkenayyā

(||iṁṭi||)
vĕlam̐di māḍāḍinade vĕṁgĕmulai tem̐ganaga
malasi yīnerami manniṁchavayyā
alamibaṭṭinade abarādhamaidem̐ gana
balimisĕllam̐ga nīgum̐ baṁtamichchīnayyā

(||iṁṭi||)
iṁti pādālŏtti nade yĕggulaidem̐ ganaga
sĕṁtane neru pābĕgum̐ jĕppavayyā
kāṁtanu śhrīveṁkaḍeśha kalisidi viṁtalonĕ
viṁtaviṁtaradulanu viyyamaṁdavayyā