Imtigi vachchinameemda nimkam gaadamdu radave

ఇంటికి వచ్చినమీఁద నిఁకఁ గాదందు రటవే
Language

(॥పల్లవి॥)
ఇంటికి వచ్చినమీఁద నిఁకఁ గాదందు రటవే
జంట వాయకుండఁగాను జంకింతు రటవే

(॥ఇంటి॥)
రమణుఁడు నీవద్ద నూరక పవ్వళిం చుండఁగా
తమకించి మాటలాడఁ దగవౌనటే
చెమటలు గారఁగాను చేతఁ దుడుచుకొనీని
సముకమున నీ వింత సాదింతు రటవే

(॥ఇంటి॥)
తొడమీఁదఁ దొడవేసి తోడ బుసకొట్టఁగా
బెడఁగుగాఁ జూచి కోపంతు రటవే
అడరి నీపానుపుపై నలయుచు నున్నాఁడు
యెడనెడఁ గాఁతాళించి యెలయింతు రటవే

(॥ఇంటి॥)
వెస నీ కాఁగిటఁ దాను వెరఁగువడి వుండఁగా
కొసరులు పైపైఁ జిలుకుదు రటవే
యెసగ శ్రీ వేంకటేశుఁ డిదె నిన్నుఁ గూడినాఁడు
పసలుగఁ దొల్లింటిను లెంతు రటవే

(||pallavi||)
iṁṭigi vachchinamīm̐da nim̐kam̐ gādaṁdu raḍave
jaṁṭa vāyaguṁḍam̐gānu jaṁkiṁtu raḍave

(||iṁṭi||)
ramaṇum̐ḍu nīvadda nūraga pavvaḽiṁ suṁḍam̐gā
tamagiṁchi māḍalāḍam̐ dagavaunaḍe
sĕmaḍalu gāram̐gānu sedam̐ duḍusugŏnīni
samugamuna nī viṁta sādiṁtu raḍave

(||iṁṭi||)
tŏḍamīm̐dam̐ dŏḍavesi toḍa busagŏṭṭam̐gā
bĕḍam̐gugām̐ jūsi kobaṁtu raḍave
aḍari nībānububai nalayusu nunnām̐ḍu
yĕḍanĕḍam̐ gām̐tāḽiṁchi yĕlayiṁtu raḍave

(||iṁṭi||)
vĕsa nī kām̐giḍam̐ dānu vĕram̐guvaḍi vuṁḍam̐gā
kŏsarulu paibaim̐ jilugudu raḍave
yĕsaga śhrī veṁkaḍeśhum̐ ḍidĕ ninnum̐ gūḍinām̐ḍu
pasalugam̐ dŏlliṁṭinu lĕṁtu raḍave