(॥పల్లవి॥)
ఇంటికి వచ్చితి నిఁకనేలే
జంటల మనలో జగడము దీరె
(॥ఇంటి॥)
చాయలఁ దిట్టకు సన్నలఁ గొణఁగకు
చేయిని వేసితి చెక్కును నొక్కితి
మాయలు సేయకు మతకము నెరవకు
నాయంత నవ్వితి ననుపును నాయ
(॥ఇంటి॥)
శిరసును వంచకు చింతలఁ బొరలకు
కురులునుఁ జెరిగితి కుంకుమ పూసితి
నెరుసులు వెదకకు నేరము లెంచకు
వొరసితి నీతో నొక్కటులాయ
(॥ఇంటి॥)
చిమ్మకు చూపులు సిగ్గులఁ బొరలకు
కమ్మర గాఁగిటఁ గలసితి వెలసితి
యిమ్ముల శ్రీవేంకటేశుఁడ నేనిదె
రమ్మని పిలిచితి రతికెక్కితిని
(||pallavi||)
iṁṭigi vachchidi nim̐kanele
jaṁṭala manalo jagaḍamu dīrĕ
(||iṁṭi||)
sāyalam̐ diṭṭagu sannalam̐ gŏṇam̐gagu
seyini vesidi sĕkkunu nŏkkidi
māyalu seyagu madagamu nĕravagu
nāyaṁta navvidi nanubunu nāya
(||iṁṭi||)
śhirasunu vaṁchagu siṁtalam̐ bŏralagu
kurulunum̐ jĕrigidi kuṁkuma pūsidi
nĕrusulu vĕdagagu neramu lĕṁchagu
vŏrasidi nīdo nŏkkaḍulāya
(||iṁṭi||)
simmagu sūbulu siggulam̐ bŏralagu
kammara gām̐giḍam̐ galasidi vĕlasidi
yimmula śhrīveṁkaḍeśhum̐ḍa nenidĕ
rammani pilisidi radigĕkkidini