Imtigi rammanave yedamaamta limkanela

ఇంటికి రమ్మనవే యెడమాఁట లిఁకనేల
Language

(॥పల్లవి॥)
ఇంటికి రమ్మనవే యెడమాఁట లిఁకనేల
వింటిఁ దన సుద్దులెల్లా వేసాలిఁక నేఁటికి

(॥ఇంటి॥)
చూడఁ జూడ వేడుకాయ సొరిదిఁ దన చేఁతలు
యీడ లిందరిలోఁ దను నమనేనే
కోడెకాఁడు మొదలనే గురుతులు మెయి నున్నవి
కూడి సంతోసించేఁగాక కొఱత లెంచేనా

(॥ఇంటి॥)
వండ వండనట్లాయ వలచిన వలపులు
చండి సేసి తను నిఁక సాదించేనా
నిండుదొర తాను మరి నేరుచు మాఁటలెల్లాను
అండఁ బాయకుండేఁగాక ఆఱడిఁ బెట్టేనా

(॥ఇంటి॥)
వూర నూర నూటలాయ నొద్దికఁ దనమోహము
మేర మీరి ఇఁకఁ దను మెచ్చకుండేనా
చేరి నన్నుఁ దానె కూడె శ్రీ వేంకటేశుఁడు
సారెకుఁబొగడేఁ గాక చదురులాడేనా

(||pallavi||)
iṁṭigi rammanave yĕḍamām̐ṭa lim̐kanela
viṁṭim̐ dana suddulĕllā vesālim̐ka nem̐ṭigi

(||iṁṭi||)
sūḍam̐ jūḍa veḍugāya sŏridim̐ dana sem̐talu
yīḍa liṁdarilom̐ danu namanene
koḍĕgām̐ḍu mŏdalane gurudulu mĕyi nunnavi
kūḍi saṁtosiṁchem̐gāga kŏṟada lĕṁchenā

(||iṁṭi||)
vaṁḍa vaṁḍanaṭlāya valasina valabulu
saṁḍi sesi tanu nim̐ka sādiṁchenā
niṁḍudŏra tānu mari nerusu mām̐ṭalĕllānu
aṁḍam̐ bāyaguṁḍem̐gāga āṟaḍim̐ bĕṭṭenā

(||iṁṭi||)
vūra nūra nūḍalāya nŏddigam̐ danamohamu
mera mīri im̐kam̐ danu mĕchchaguṁḍenā
seri nannum̐ dānĕ kūḍĕ śhrī veṁkaḍeśhum̐ḍu
sārĕgum̐bŏgaḍem̐ gāga sadurulāḍenā