Imtigi rammanave iyyagomti ramanuni

ఇంటికి రమ్మనవే ఇయ్యకొంటి రమణుని
Language

(॥పల్లవి॥)
ఇంటికి రమ్మనవే ఇయ్యకొంటి రమణుని
జంటయై కూడుండేము సాదింపు లేల

(॥ఇంటి॥)
తనమనసే యెరుఁగు తా నాతో నాడినమాట
పనివడి నేఁ జెప్పి పంపే దేమి
చెనకిన చెనకులు చనుఁగపై నున్నవి
పెనఁగి సిగ్గులు మరి పెంచఁగఁ జోటేది

(॥ఇంటి॥)
మెడవి తనసొమ్ములు మేనవాఁడు మొదలనే
యెడయక వేఁడు కోను యిఁక నేఁటికి
వడిసీ మైఁ జెమటలు వలపులు తల కెక్క
కడువాసి వంతు లెంచఁ గారణము లేమి

(॥ఇంటి॥)
కమ్మి శ్రీ వేంకటేశుడు కాఁగిట్టి నున్నాఁడు తా -
నిమ్ముల మోవిచవులు యెంచవలెనా
తమ్ములము పక్కిటిది తనువెల్లాఁ బులకలే
కుమ్మరించీ ముద్దులు గునియఁగ వలెనా

(||pallavi||)
iṁṭigi rammanave iyyagŏṁṭi ramaṇuni
jaṁṭayai kūḍuṁḍemu sādiṁpu lela

(||iṁṭi||)
tanamanase yĕrum̐gu tā nādo nāḍinamāḍa
panivaḍi nem̐ jĕppi paṁpe demi
sĕnagina sĕnagulu sanum̐gabai nunnavi
pĕnam̐gi siggulu mari pĕṁcham̐gam̐ joḍedi

(||iṁṭi||)
mĕḍavi tanasŏmmulu menavām̐ḍu mŏdalane
yĕḍayaga vem̐ḍu konu yim̐ka nem̐ṭigi
vaḍisī maim̐ jĕmaḍalu valabulu tala kĕkka
kaḍuvāsi vaṁtu lĕṁcham̐ gāraṇamu lemi

(||iṁṭi||)
kammi śhrī veṁkaḍeśhuḍu kām̐giṭṭi nunnām̐ḍu tā -
nimmula movisavulu yĕṁchavalĕnā
tammulamu pakkiḍidi tanuvĕllām̐ bulagale
kummariṁchī muddulu guniyam̐ga valĕnā