Imtigi neevu valasu timdaramu neṟumgudu

ఇంతికి నీవు వలచు టిందరము నెఱుఁగుదు
Language

(॥పల్లవి॥)
ఇంతికి నీవు వలచు టిందరము నెఱుఁగుదు-
మంతలోనే ఆపె మొక్కీ నాదరించరాదా

(॥ఇంతి॥)
సిగ్గువడి వుండఁగాను చెయివట్టేల తీసేవు
అగ్గమై ముందు సరస మాడరాదా
దిగ్గనఁ గాను కియ్యఁగా తెర యేల వేసేవు
వెగ్గళించక చేతికి విడె మియ్యరాదా

(॥ఇంతి॥)
గుట్టుతోనే వుండఁగాను కుచము లేలంటేవు
బట్టబయలుగా నవ్వి పైకొనరాదా
చుట్టమైనదానివాసులు రేఁచ మరి యేల
ఱట్టు సేయక పొత్తుకు యిట్టె రమ్మనరాదా

(॥ఇంతి॥)
తలవంచు కుండఁగాను తప్పక యేమి చూచేవు
మలసి కాఁగిట నించి మన్నించరాదా
యెలమి శ్రీవేంకటేశ యెనసితి నీపెను
తలకొని రతులను దప్పి దేర్చరాదా

(||pallavi||)
iṁtigi nīvu valasu ṭiṁdaramu nĕṟum̐gudu-
maṁtalone ābĕ mŏkkī nādariṁcharādā

(||iṁti||)
sigguvaḍi vuṁḍam̐gānu sĕyivaṭṭela tīsevu
aggamai muṁdu sarasa māḍarādā
digganam̐ gānu kiyyam̐gā tĕra yela vesevu
vĕggaḽiṁchaga sedigi viḍĕ miyyarādā

(||iṁti||)
guṭṭudone vuṁḍam̐gānu kusamu lelaṁṭevu
baṭṭabayalugā navvi paigŏnarādā
suṭṭamainadānivāsulu rem̐sa mari yela
ṟaṭṭu seyaga pŏttugu yiṭṭĕ rammanarādā

(||iṁti||)
talavaṁchu kuṁḍam̐gānu tappaga yemi sūsevu
malasi kām̐giḍa niṁchi manniṁcharādā
yĕlami śhrīveṁkaḍeśha yĕnasidi nībĕnu
talagŏni radulanu dappi dersarādā