ఇంతికి నీవు లోనైతి వేమందు నిన్ను
(॥పల్లవి॥)
ఇంతికి నీవు లోనైతి వేమందు నిన్ను
పంతములాడేటి కాంతఁ బట్టవచ్చునా
(॥ఇంతి॥)
నాయములు చెప్పఁగాను నన్నునేల తిట్టేవు
ఆయింతిపొందు సేయుమంటినా నిన్ను
ఆయెడ నే నడ్డమురానని నన్ను దూరేవు
పాయపుమదముసతిఁ బటవచ్చునా
(॥ఇంతి॥)
నడుమ నవ్వేటిదాని నన్నునెల గద్దించేవు
గొడవ లాపెతోఁ బెట్టుకొమ్మంటినా
తొడిఁబడ నీకు నేను తోడుగానైతి ననేవు
బడిఁబైకొనేజవ్వనిఁ బట్టవచ్చునా
(॥ఇంతి॥)
నిన్నుఁ జేయివట్టేదాని నీవేల సొలసేవు
అన్నిటా నాపెతోఁ బెనఁగాడుమంటినా
యెన్నఁగ శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
పన్ని నీమోహపుఁజెలిఁ బట్టవచ్చునా
(||pallavi||)
iṁtigi nīvu lonaidi vemaṁdu ninnu
paṁtamulāḍeḍi kāṁtam̐ baṭṭavachchunā
(||iṁti||)
nāyamulu sĕppam̐gānu nannunela tiṭṭevu
āyiṁtibŏṁdu seyumaṁṭinā ninnu
āyĕḍa ne naḍḍamurānani nannu dūrevu
pāyabumadamusadim̐ baḍavachchunā
(||iṁti||)
naḍuma navveḍidāni nannunĕla gaddiṁchevu
gŏḍava lābĕdom̐ bĕṭṭugŏmmaṁṭinā
tŏḍim̐baḍa nīgu nenu toḍugānaidi nanevu
baḍim̐baigŏnejavvanim̐ baṭṭavachchunā
(||iṁti||)
ninnum̐ jeyivaṭṭedāni nīvela sŏlasevu
anniḍā nābĕdom̐ bĕnam̐gāḍumaṁṭinā
yĕnnam̐ga śhrīveṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
panni nīmohabum̐jĕlim̐ baṭṭavachchunā