Imtigi neegunu vaasi yeebaadi nunnadi

ఇంతికి నీకును వాసి యీపాటి నున్నది
Language

(॥పల్లవి॥)
ఇంతికి నీకును వాసి యీపాటి నున్నది
యెంతకు నోపవు నీవు యేమనేము నిన్నును

(॥ఇంతి॥)
చెక్కునఁ జేయివెట్టుక సిగ్గులువడీ నాపె
నెక్కొని సారె నాడేటినీమాఁటలకు
పక్కన నీవైతే నవ్వుఁబాట్లకు వెరవవు
వెక్కసాన నీవిచ్చనవీళ్లాయ వలపు

(॥ఇంతి॥)
నంటునఁ దలవంచుక నవ్వులు నవ్వీ నాపె
అంటిముట్టి చెనకీ(కే?) నీయాసోదాలకు
గొంటుపడి నీకైతే గుట్టించుకంతా లేదు
పెంటలై పైపైఁ బెచ్చువెరిగీ నీవయసు

(॥ఇంతి॥)
తెరమఱంగున నుండి దిష్టించిచూచీ నాపె
సరసములాడేనిసరితలకు
గరిమ శ్రీవేంకటేశ కలసితి వాపె నిట్టె
యెరవులు లేక నీకు విరవాయ మనసు

(||pallavi||)
iṁtigi nīgunu vāsi yībāḍi nunnadi
yĕṁtagu nobavu nīvu yemanemu ninnunu

(||iṁti||)
sĕkkunam̐ jeyivĕṭṭuga sigguluvaḍī nābĕ
nĕkkŏni sārĕ nāḍeḍinīmām̐ṭalagu
pakkana nīvaide navvum̐bāṭlagu vĕravavu
vĕkkasāna nīvichchanavīḽlāya valabu

(||iṁti||)
naṁṭunam̐ dalavaṁchuga navvulu navvī nābĕ
aṁṭimuṭṭi sĕnagī(ke?) nīyāsodālagu
gŏṁṭubaḍi nīgaide guṭṭiṁchugaṁtā ledu
pĕṁṭalai paibaim̐ bĕchchuvĕrigī nīvayasu

(||iṁti||)
tĕramaṟaṁguna nuṁḍi diṣhṭiṁchisūsī nābĕ
sarasamulāḍenisaridalagu
garima śhrīveṁkaḍeśha kalasidi vābĕ niṭṭĕ
yĕravulu lega nīgu viravāya manasu