Imtigi neegum dagavulidivo seppemu nemu

ఇంతికి నీకుఁ దగవులిదివో చెప్పేము నేము
Language

(॥పల్లవి॥)
ఇంతికి నీకుఁ దగవులిదివో చెప్పేము నేము
రంతు సేయరాదుగాని రవ్వసేయవచ్చును

(॥ఇంతి॥)
తెగనాడరాదుగాని తేనెగారే మోవి నిన్ను
తెగడి తెగడి ఇట్టె తిట్టవచ్చును
నగవద్దుగాని నీనటనలు పచారించి
వెగటు లేకుండానువెంగమాడవచ్చును

(॥ఇంతి॥)
జంకించరాదుగాని సతికినీతిరుమేను
అంకించికొనగోర నంటవచ్చును
మంకు చూపవద్దుగాని మనసిచ్చి యన్నిటాను
కంకిసేసిరతులనుకాఁగిలించవచ్చును

(॥ఇంతి॥)
వేసరుకోరాదుగాని వేడుకతోనిన్నుఁగూడి
ఆసచూసి సన్నలు సేయఁగవచ్చును
యీసు లిఁక వద్దుగానియిట్టెశ్రీవేంకటేశ
సేసవెట్టి కూడెఁ జెలి చేరి మెచ్చవచ్చును

(||pallavi||)
iṁtigi nīgum̐ dagavulidivo sĕppemu nemu
raṁtu seyarādugāni ravvaseyavachchunu

(||iṁti||)
tĕganāḍarādugāni tenĕgāre movi ninnu
tĕgaḍi tĕgaḍi iṭṭĕ tiṭṭavachchunu
nagavaddugāni nīnaḍanalu pasāriṁchi
vĕgaḍu leguṁḍānuvĕṁgamāḍavachchunu

(||iṁti||)
jaṁkiṁcharādugāni sadiginīdirumenu
aṁkiṁchigŏnagora naṁṭavachchunu
maṁku sūbavaddugāni manasichchi yanniḍānu
kaṁkisesiradulanugām̐giliṁchavachchunu

(||iṁti||)
vesarugorādugāni veḍugadoninnum̐gūḍi
āsasūsi sannalu seyam̐gavachchunu
yīsu lim̐ka vaddugāniyiṭṭĕśhrīveṁkaḍeśha
sesavĕṭṭi kūḍĕm̐ jĕli seri mĕchchavachchunu