(॥పల్లవి॥)
ఇంతితోడ నీవేల యెదురాడేవు
సంతరించినవాఁడవు చనవియ్యవలెను
(॥ఇంతి॥)
పలపుగలవానికి వాసు లెంచఁబనిలేదు
చెలు లేమిచెప్పినానుఁ జేయవలెను
కలపుకోలైనచోటఁ గడువింత సేయరాదు
వొలిసినట్టల్లాను వొడఁబడవలెను
(॥ఇంతి॥)
మగఁడైనపిమ్మటను మరి యెరవేమిటికి
తగుసతులకు లోనై దక్కవలెను
జగడించరానందుకు చలములు మరియేల
నగినయట్టే నవ్వి ననుచఁగవలెను
(॥ఇంతి॥)
విడువరానిపొందుకు వేరుచేసుకోఁదగదు
పడఁతులమాట నడపఁగవలెను
యెడయక శ్రీవేంకటేశ యీకెఁ గూడితివి
వుడివోనివేడుకల వొద్దిక గావలెను
(||pallavi||)
iṁtidoḍa nīvela yĕdurāḍevu
saṁtariṁchinavām̐ḍavu sanaviyyavalĕnu
(||iṁti||)
palabugalavānigi vāsu lĕṁcham̐baniledu
sĕlu lemisĕppinānum̐ jeyavalĕnu
kalabugolainasoḍam̐ gaḍuviṁta seyarādu
vŏlisinaṭṭallānu vŏḍam̐baḍavalĕnu
(||iṁti||)
magam̐ḍainabimmaḍanu mari yĕravemiḍigi
tagusadulagu lonai dakkavalĕnu
jagaḍiṁcharānaṁdugu salamulu mariyela
naginayaṭṭe navvi nanusam̐gavalĕnu
(||iṁti||)
viḍuvarānibŏṁdugu verusesugom̐dagadu
paḍam̐tulamāḍa naḍabam̐gavalĕnu
yĕḍayaga śhrīveṁkaḍeśha yīgĕm̐ gūḍidivi
vuḍivoniveḍugala vŏddiga gāvalĕnu