Imtido sarim benamge vemayyaa

ఇంతితో సరిఁ బెనఁగే వేమయ్యా
Language

(॥పల్లవి॥)
ఇంతితో సరిఁ బెనఁగే వేమయ్యా
పంతముతో ఆపె నిట్టే పలికించఁ గలవా

(॥ఇంతి॥)
సెలవినే లోలోన చెలి యట్టె నవ్వఁగాను
యెలమి నీవూ నవ్వే వేమయ్యా
కులికి యిందుకు నాపె కోపగించుకొంటేఁగన
వెలికి లోనికి వచ్చి వేడుకొనఁగలవా

(॥ఇంతి॥)
నిమ్మపంటఁ గొని యాపె నీమీఁద వేయఁగాను
యెమ్మెలకు నీవు వేసే వేమయ్యా
కమ్మి యాపె మేనుఁ దాఁకి కంది నొచ్చితేఁ గనక
దిమ్ముల నీ వానొప్పి తీరుచఁగఁ గలవా

(॥ఇంతి॥)
గట్టిగా ఆపె నిన్ను కాఁగిట బిగించఁగాను
యిట్టె నీవూ బిగియించే వేమయ్యా
నెట్టన శ్రీవేంకటేశ నిన్ను నాపె గూడె నిదే
మెట్టుక యాపెవు నీవు మెప్పించఁ గలవా

(||pallavi||)
iṁtido sarim̐ bĕnam̐ge vemayyā
paṁtamudo ābĕ niṭṭe paligiṁcham̐ galavā

(||iṁti||)
sĕlavine lolona sĕli yaṭṭĕ navvam̐gānu
yĕlami nīvū navve vemayyā
kuligi yiṁdugu nābĕ kobagiṁchugŏṁṭem̐gana
vĕligi lonigi vachchi veḍugŏnam̐galavā

(||iṁti||)
nimmabaṁṭam̐ gŏni yābĕ nīmīm̐da veyam̐gānu
yĕmmĕlagu nīvu vese vemayyā
kammi yābĕ menum̐ dām̐ki kaṁdi nŏchchidem̐ ganaga
dimmula nī vānŏppi tīrusam̐gam̐ galavā

(||iṁti||)
gaṭṭigā ābĕ ninnu kām̐giḍa bigiṁcham̐gānu
yiṭṭĕ nīvū bigiyiṁche vemayyā
nĕṭṭana śhrīveṁkaḍeśha ninnu nābĕ gūḍĕ nide
mĕṭṭuga yābĕvu nīvu mĕppiṁcham̐ galavā