ఇంతితో మాటాడవయ్య ఇఁక నేఁటికి
(॥పల్లవి॥)
ఇంతితో మాటాడవయ్య ఇఁక నేఁటికి
చెంతలఁ జెలి వుండితే సిగ్గు వొయ్యీనా
(॥ఇంతి॥)
తేనెలు గారేటి మోవి తి ట్లాపెఁ(పె) దిట్టితేను
దాననే మగతనము తక్కువయ్యీనా
నానఁబెట్టి సెలవుల నవ్వులు నవ్వితేనేమి
కోనలనీ బిరుదుకు కొంచెమయ్యీనా
(॥ఇంతి॥)
చేగలు దేరేటి గోర చెక్కు లాపె నొక్కితేను
సాగిన దొరతనము చవుకయ్యీనా
బాగుగ నీ పాదమునఁ దొక్కితేను
వేగిరపుఁ బంతానకు వెలితయ్యీనా
(॥ఇంతి॥)
పాలుగారే చన్నులను పైకొని యాపె యొత్తితే
మేలిమి నీమనసెల్ల మెత్తనయ్యీనా
యీలీల శ్రీ వేంకటేశ యింతి నిన్నుఁ గూడెనిదె
ఆలరి నీ వలపులు అంగడికెక్కీనా
(||pallavi||)
iṁtido māḍāḍavayya im̐ka nem̐ṭigi
sĕṁtalam̐ jĕli vuṁḍide siggu vŏyyīnā
(||iṁti||)
tenĕlu gāreḍi movi ti ṭlābĕm̐(pĕ) diṭṭidenu
dānane magadanamu takkuvayyīnā
nānam̐bĕṭṭi sĕlavula navvulu navvidenemi
konalanī birudugu kŏṁchĕmayyīnā
(||iṁti||)
segalu dereḍi gora sĕkku lābĕ nŏkkidenu
sāgina dŏradanamu savugayyīnā
bāguga nī pādamunam̐ dŏkkidenu
vegirabum̐ baṁtānagu vĕlidayyīnā
(||iṁti||)
pālugāre sannulanu paigŏni yābĕ yŏttide
melimi nīmanasĕlla mĕttanayyīnā
yīlīla śhrī veṁkaḍeśha yiṁti ninnum̐ gūḍĕnidĕ
ālari nī valabulu aṁgaḍigĕkkīnā