ఇంతిదే పో దీమసము యెవ్వరు నేమి చెప్పేరు
(॥పల్లవి॥)
ఇంతిదే పో దీమసము యెవ్వరు నేమి చెప్పేరు
యెంత సేసినా విరస మింతయుఁ గడచెను
(॥ఇంతిదే॥)
ఘనుఁడవు నీవు చంద్రగావి గట్టుకుండఁగాను
వనజాక్షి యయ్యు నిన్నే వడిఁ జూచెను
మునుసంపెంగవిరులు ముడుచుక నీవు రాఁగా
వనితలివేణి యయ్యు వాడికె మాటాడెను
(॥ఇంతిదే॥)
సరఁసుడ నీవు సింహనముపైనుండఁగాను
కరిగమనయ్యు నీ దగ్గర వచ్చెను
సొరిది నీవు వజ్రపుసొమ్ములు నించుకుండఁగాను
గిరికుచయయ్యు నిన్ను గిలిగించ వచ్చెను
(॥ఇంతిదే॥)
కామించి నీవు నెమలిగతి రతి నాటలాడ
పామువంటి యారుగలపడఁతి గూడె
దోమటి శ్రీవేంకటేశ తొలుతటి మీలోని
బూమెలవైరాలు దీరఁ బొందొకటి సేసెను
(||pallavi||)
iṁtide po dīmasamu yĕvvaru nemi sĕpperu
yĕṁta sesinā virasa miṁtayum̐ gaḍasĕnu
(||iṁtide||)
ghanum̐ḍavu nīvu saṁdragāvi gaṭṭuguṁḍam̐gānu
vanajākṣhi yayyu ninne vaḍim̐ jūsĕnu
munusaṁpĕṁgavirulu muḍusuga nīvu rām̐gā
vanidaliveṇi yayyu vāḍigĕ māḍāḍĕnu
(||iṁtide||)
saram̐suḍa nīvu siṁhanamubainuṁḍam̐gānu
karigamanayyu nī daggara vachchĕnu
sŏridi nīvu vajrabusŏmmulu niṁchuguṁḍam̐gānu
girigusayayyu ninnu giligiṁcha vachchĕnu
(||iṁtide||)
kāmiṁchi nīvu nĕmaligadi radi nāḍalāḍa
pāmuvaṁṭi yārugalabaḍam̐ti gūḍĕ
domaḍi śhrīveṁkaḍeśha tŏludaḍi mīloni
būmĕlavairālu dīram̐ bŏṁdŏgaḍi sesĕnu