Imtidaana nem danagu nelinaamdu nannum daanu

ఇంటిదాన నేఁ దనకు నేలినాఁడు నన్నుఁ దాను
Language

(॥పల్లవి॥)
ఇంటిదాన నేఁ దనకు నేలినాఁడు నన్నుఁ దాను
దంటతనమున నేల తతిగొనీ నీతఁడు

(॥ఇంటి॥)
వల పెంత గలిగినా వడ్డి కిచ్చుకొమ్మనవే
పొలవ నవ్వులు గాదెఁ బోయి మనవే
చలము బలిమిఁ గలిగితే సాము సేయు మనవే
యెలమి నాతో నిట్టే యేమి చెప్పీ నీతఁడు

(॥ఇంటి॥)
నేరు పెంత గలిగినా నేలఁ బాఁతుకొమ్మ నవే
కోరికె లెల్లా వెలకుఁ గొను మనవే
వోరు పెంత గలిగినా వొడిఁ గట్టుకొమ్మనవే
యీరీతి నెందాఁకా నాతో నేమి చెప్పీ నీతఁడు

(॥ఇంటి॥)
బాసలెన్ని గలిగినాఁ బచరించు మనవే
వాసు లిద్దరికీ సరివంతుల నవే
యీసు లేక శ్రీవేంకటేశుఁడే తా నన్నుఁ గూడె
యే సుద్దు లప్పుటి నాతో నేమి చెప్పీ నీతఁడు

(||pallavi||)
iṁṭidāna nem̐ danagu nelinām̐ḍu nannum̐ dānu
daṁṭadanamuna nela tadigŏnī nīdam̐ḍu

(||iṁṭi||)
vala pĕṁta galiginā vaḍḍi kichchugŏmmanave
pŏlava navvulu gādĕm̐ boyi manave
salamu balimim̐ galigide sāmu seyu manave
yĕlami nādo niṭṭe yemi sĕppī nīdam̐ḍu

(||iṁṭi||)
neru pĕṁta galiginā nelam̐ bām̐tugŏmma nave
korigĕ lĕllā vĕlagum̐ gŏnu manave
voru pĕṁta galiginā vŏḍim̐ gaṭṭugŏmmanave
yīrīdi nĕṁdām̐kā nādo nemi sĕppī nīdam̐ḍu

(||iṁṭi||)
bāsalĕnni galiginām̐ basariṁchu manave
vāsu liddarigī sarivaṁtula nave
yīsu lega śhrīveṁkaḍeśhum̐ḍe tā nannum̐ gūḍĕ
ye suddu lappuḍi nādo nemi sĕppī nīdam̐ḍu