ఇంతిపైఁ గలుగు బత్తి ఇఁక మాకుఁ జెప్పనేల
(॥పల్లవి॥)
ఇంతిపైఁ గలుగు బత్తి ఇఁక మాకుఁ జెప్పనేల
వింత నీ నవ్వులలోనే వెసఁ గానిపించెను
(॥ఇంతి॥)
గాఁటమై మాచెలిమీఁదఁ గలిగిన మోహమెల్లా
తేటలనీ మోము చూచే తెలిసె మాకు
తాటించి నీ మనసులో తమకములెల్లాను
మాటలు నీవాడేయందే మరి తెల్లమాయను
(॥ఇంతి॥)
మలసి యాసకియను మన్నించేమన్ననలెల్లా
తిలకించి చూచినందే దిష్టమాయను
కలకాలమును నీవు కైవసమై వుండేదెల్లా
పలుమారు నీవున్న భావాననే తోఁచెను
(॥ఇంతి॥)
అప్పటి నీవాదరించే ఆదరము లెల్లాను
కప్పురమీఁగానే యెరఁగఁగ వచ్చెను
ఇప్పుడిట్టె శ్రీవేంకటేశ ఇంతి నేలితివి
వొప్పులు నీరతులలో నొగి సరివచ్చెను
(||pallavi||)
iṁtibaim̐ galugu batti im̐ka māgum̐ jĕppanela
viṁta nī navvulalone vĕsam̐ gānibiṁchĕnu
(||iṁti||)
gām̐ṭamai māsĕlimīm̐dam̐ galigina mohamĕllā
teḍalanī momu sūse tĕlisĕ māgu
tāḍiṁchi nī manasulo tamagamulĕllānu
māḍalu nīvāḍeyaṁde mari tĕllamāyanu
(||iṁti||)
malasi yāsagiyanu manniṁchemannanalĕllā
tilagiṁchi sūsinaṁde diṣhṭamāyanu
kalagālamunu nīvu kaivasamai vuṁḍedĕllā
palumāru nīvunna bhāvānane tom̐sĕnu
(||iṁti||)
appaḍi nīvādariṁche ādaramu lĕllānu
kappuramīm̐gāne yĕram̐gam̐ga vachchĕnu
ippuḍiṭṭĕ śhrīveṁkaḍeśha iṁti nelidivi
vŏppulu nīradulalo nŏgi sarivachchĕnu