Imti yide neevide yimka nennadu

ఇంతి యిదె నీవిదె యిఁక నెన్నడు
Language

(॥పల్లవి॥)
ఇంతి యిదె నీవిదె యిఁక నెన్నడు
సంతసాలు రేఁచకుంటే చవు లేడ నున్నవి

(॥ఇంతి॥)
అలిగి మాఁటాడనట్టిఅతివను నేరుపున
పలికించకుంటేను పంతములేవి
చలపట్టిన గొంటెతఁ జక్క నవ్వించకుంటేను
తలకొన్ననీజాణతన మేమి వున్నది

(॥ఇంతి॥)
చెక్కుతోఁ జింతించేయాపెఁ జెలరేఁగించి సారెకు
చక్కఁగా నవ్వించకుంటేఁ జనవులేవి
మొక్కలాన రతులకు మొగియకవున్నయాపె
మొక్కఁ జేసుకొనకుంటే మోహమేమి వున్నది

(॥ఇంతి॥)
కతలుచెప్పినసతిచే కాఁగిలింపించుకొనకుంటే
యితవు శ్రీవేంకటేశ యేమున్నది
తతిగొని నిన్నుఁ గలసి తమకించేయాకెనిండు-
వ్రత మీడేరుచకుంటే వాడికేమి వున్నది

(||pallavi||)
iṁti yidĕ nīvidĕ yim̐ka nĕnnaḍu
saṁtasālu rem̐saguṁṭe savu leḍa nunnavi

(||iṁti||)
aligi mām̐ṭāḍanaṭṭiadivanu nerubuna
paligiṁchaguṁṭenu paṁtamulevi
salabaṭṭina gŏṁṭĕdam̐ jakka navviṁchaguṁṭenu
talagŏnnanījāṇadana memi vunnadi

(||iṁti||)
sĕkkudom̐ jiṁtiṁcheyābĕm̐ jĕlarem̐giṁchi sārĕgu
sakkam̐gā navviṁchaguṁṭem̐ janavulevi
mŏkkalāna radulagu mŏgiyagavunnayābĕ
mŏkkam̐ jesugŏnaguṁṭe mohamemi vunnadi

(||iṁti||)
kadalusĕppinasadise kām̐giliṁpiṁchugŏnaguṁṭe
yidavu śhrīveṁkaḍeśha yemunnadi
tadigŏni ninnum̐ galasi tamagiṁcheyāgĕniṁḍu-
vrada mīḍerusaguṁṭe vāḍigemi vunnadi