Imti yemiseseenamtaa yela vela yadigevu

ఇంతి యేమిసేసీనంటా యేల వేళ యడిగేవు
Language

(॥పల్లవి॥)
ఇంతి యేమిసేసీనంటా యేల వేళ యడిగేవు
చెంత నీకెదురుచూచి చిమ్మి రేఁగీనయ్యా

(॥ఇంతి॥)
చిలుకలఁ జదివించీఁ జెలులఁ గూడి
కలువదండులు గట్టీఁ గందువ నుండి
మొలవఁబెట్టీ జాజులు మునుకొని
వెలది పూఁదోఁటలో విహరించీనయ్యా

(॥ఇంతి॥)
గుదిగుచ్చీ తామరలు గుట్టుతోడను
కదిమి తుమ్మిదలమూఁకలు రేఁచీని
సదరానఁ బన్నీరు చల్లులాడీని
వుదుటునఁ గేళాకూళి నోలలాడీనయ్యా

(॥ఇంతి॥)
పొంచి పొంచి చల్లగాలి పొందుసేసీని
కొంచక వెన్నెలలెల్లాఁ గూడపెట్టీని
నించి శ్రీవేంకటేశ్వర నిన్నలమేల్మంగ కూడె
మంచముపైఁ గాఁగిట నెమ్మది నున్నదయ్యా

(||pallavi||)
iṁti yemisesīnaṁṭā yela veḽa yaḍigevu
sĕṁta nīgĕdurusūsi simmi rem̐gīnayyā

(||iṁti||)
silugalam̐ jadiviṁchīm̐ jĕlulam̐ gūḍi
kaluvadaṁḍulu gaṭṭīm̐ gaṁduva nuṁḍi
mŏlavam̐bĕṭṭī jājulu munugŏni
vĕladi pūm̐dom̐ṭalo vihariṁchīnayyā

(||iṁti||)
gudiguchchī tāmaralu guṭṭudoḍanu
kadimi tummidalamūm̐kalu rem̐sīni
sadarānam̐ bannīru sallulāḍīni
vuduḍunam̐ geḽāgūḽi nolalāḍīnayyā

(||iṁti||)
pŏṁchi pŏṁchi sallagāli pŏṁdusesīni
kŏṁchaga vĕnnĕlalĕllām̐ gūḍabĕṭṭīni
niṁchi śhrīveṁkaḍeśhvara ninnalamelmaṁga kūḍĕ
maṁchamubaim̐ gām̐giḍa nĕmmadi nunnadayyā