ఇంతి యేమి సేసీవంటా యేమి యడిగేవు మమ్ము
(॥పల్లవి॥)
ఇంతి యేమి సేసీవంటా యేమి యడిగేవు మమ్ము
అంతేసి యెఱుఁగుదుమా ఆపె నీవే కాక
(॥॥)
తలపోయుచున్నది తరుణి నీ రూపము
చెలరేఁగి చెక్కిటి చేత నున్నది
వలపులు కొనగోర వాసుకొంటా నున్నది
సెలవుల నవ్వుతోడ సిగ్గువడి వున్నది
(॥॥)
అడుగుతా నున్నది అంగనల నీసుద్దులు
అడరి తా నుస్సు రస్సు రంటా నున్నది
అడియాలపు నీ సొమ్ము లవి చూచుచున్నది
బడి బడి నీ పదాలు పాడుకొంటా నున్నది
(॥॥)
యిదె పవ్వళించి వున్న దెప్పుడు వత్తువో యంటా
కదిమి నీ కూటమికిఁ గాచుకున్నది
అదన శ్రీ వేంకటేశ అలమేలుమంగ యీకె
ముదమునఁ గూడితివి మొక్కుతా నున్నది
(||pallavi||)
iṁti yemi sesīvaṁṭā yemi yaḍigevu mammu
aṁtesi yĕṟum̐gudumā ābĕ nīve kāga
(||||)
talaboyusunnadi taruṇi nī rūbamu
sĕlarem̐gi sĕkkiḍi seda nunnadi
valabulu kŏnagora vāsugŏṁṭā nunnadi
sĕlavula navvudoḍa sigguvaḍi vunnadi
(||||)
aḍugudā nunnadi aṁganala nīsuddulu
aḍari tā nussu rassu raṁṭā nunnadi
aḍiyālabu nī sŏmmu lavi sūsusunnadi
baḍi baḍi nī padālu pāḍugŏṁṭā nunnadi
(||||)
yidĕ pavvaḽiṁchi vunna dĕppuḍu vattuvo yaṁṭā
kadimi nī kūḍamigim̐ gāsugunnadi
adana śhrī veṁkaḍeśha alamelumaṁga yīgĕ
mudamunam̐ gūḍidivi mŏkkudā nunnadi