Imti yavvanaseemagu yeligavu neevaidivi

ఇంతి యవ్వనసీమకు యేలికవు నీవైతివి
Language

(॥పల్లవి॥)
ఇంతి యవ్వనసీమకు యేలికవు నీవైతివి
రంతు లిన్నియును నేలు రపమాయ నీకును

(॥ఇంతి॥)
మొలకనవ్వులనేటి మోసులు
చెలఁగేటి పెదవులచిగురులు
మలసి పైతాఁకులమారాకులు
వలపులపైరులు వనితపై నవివో

(॥ఇంతి॥)
పూచినసిగ్గులలోనిపుప్పొడులు
కాచినచన్నుల నిమ్మకాయలు
యేచినమోవిపండ్లు యెసఁగెను
చేచేత వసంతవేళ చెలియమై నదివో

(॥ఇంతి॥)
చెప్పరానిపలుకులచిలుకలు
ముప్పిరి నెరిఁదుమ్మదమూఁకలు
యిప్పుడే శ్రీవేంకటేశ యింతి నీవు గూడఁగాను
కుప్పలకొటారులు కొమ్మమేన నదివో

(||pallavi||)
iṁti yavvanasīmagu yeligavu nīvaidivi
raṁtu linniyunu nelu rabamāya nīgunu

(||iṁti||)
mŏlaganavvulaneḍi mosulu
sĕlam̐geḍi pĕdavulasigurulu
malasi paidām̐kulamārāgulu
valabulabairulu vanidabai navivo

(||iṁti||)
pūsinasiggulalonibuppŏḍulu
kāsinasannula nimmagāyalu
yesinamovibaṁḍlu yĕsam̐gĕnu
seseda vasaṁtaveḽa sĕliyamai nadivo

(||iṁti||)
sĕpparānibalugulasilugalu
muppiri nĕrim̐dummadamūm̐kalu
yippuḍe śhrīveṁkaḍeśha yiṁti nīvu gūḍam̐gānu
kuppalagŏḍārulu kŏmmamena nadivo