ఇంతి యలిగితేఁ గన యెవ్వరి వసము గాదు
(॥పల్లవి॥)
ఇంతి యలిగితేఁ గన యెవ్వరి వసము గాదు
సంతసాన నవ్వేటి సతితోడ నగవూ
(॥ఇంతి॥)
యెక్కడ పరాకో యేమి భావించేవో
మొక్కేటిచెలిఁ గాఁగిట ముంచి యెత్తవు
మక్కువ నీకుఁ జాలదో మనసులోఁ గోపమో
నిక్కి చూచేసతితోడ నీ వేమీ ననవూ
(॥ఇంతి॥)
సిగ్గు పడ్డ విధమో చెప్పేవారు లేకో
దగ్గరి యున్నసతితోఁ దమకించవు
నిగ్గుల రాజసమో నీ వొళ్లిగుణమో
వెగ్గళించి పిలువఁగ వినియును వినవూ
(॥ఇంతి॥)
యేమి దలఁచుకొంటివో యీ వనిత భాగ్యమో
చే ముంచి సరస మాడి చెక్కు నొక్కేవు
కాముఁడు పెర రేఁచెనో కరుణ నీకుఁ బుట్టెనో
నేమపు శ్రీవెంకటేశ నీవే కూడితివి
(||pallavi||)
iṁti yaligidem̐ gana yĕvvari vasamu gādu
saṁtasāna navveḍi sadidoḍa nagavū
(||iṁti||)
yĕkkaḍa parāgo yemi bhāviṁchevo
mŏkkeḍisĕlim̐ gām̐giḍa muṁchi yĕttavu
makkuva nīgum̐ jālado manasulom̐ gobamo
nikki sūsesadidoḍa nī vemī nanavū
(||iṁti||)
siggu paḍḍa vidhamo sĕppevāru lego
daggari yunnasadidom̐ damagiṁchavu
niggula rājasamo nī vŏḽliguṇamo
vĕggaḽiṁchi piluvam̐ga viniyunu vinavū
(||iṁti||)
yemi dalam̐sugŏṁṭivo yī vanida bhāgyamo
se muṁchi sarasa māḍi sĕkku nŏkkevu
kāmum̐ḍu pĕra rem̐sĕno karuṇa nīgum̐ buṭṭĕno
nemabu śhrīvĕṁkaḍeśha nīve kūḍidivi